Plane Crash: రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం.. ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక ఫైటర్ జెట్ విమానం.. రతన్‌గఢ్ ప్రాంతంలోని ఓ పొలాల్లోకి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పైలెట్‌కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఎయిర్ ఫోర్స్ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదం వివరాలు
సాధారణ శిక్షణ విమానంగా ఉపయోగించే ఈ ఎయిర్ క్రాఫ్ట్.. ప్రమాద సమయంలో నేరుగా నేల మీద కుప్పకూలిపోయింది. దీంతో విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. శబ్దాన్ని విన్న గ్రామస్తులు వెంటనే పరుగులు పెట్టారు. ప్రమాద తీవ్రతకు విమానం పూర్తిగా నాశనమైంది. శకలాలు చుట్టూ ఉన్న పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.
పైలెట్ మృతి
విమానం నడిపిస్తున్న సమయంలో.. ఎవాక్యుయేట్ కాలేకపోయినట్టు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకుని పైలెట్ అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. విమాన శకలాల మధ్య పైలెట్ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
అధికారుల స్పందన
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎయిర్ ఫోర్స్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి వేసి జనాలను దూరంగా ఉంచుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైంది. మెకానికల్ ఫెయిల్యూర్‌నా? లేక వాతావరణ సమస్యలా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
విచారణకు ఆదేశాలు
ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి స్పందిస్తూ.. ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ప్రాథమిక వివరాల ప్రకారం ఇది శిక్షణ విమానమే. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. పైలట్ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.
ప్రాంతీయ ప్రజల ఆందోళన
విమాన కూలిన ప్రాంతానికి సమీపంగా వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రమాద సమయంలో అక్కడ పని చేస్తున్న రైతులు తీవ్రంగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వారు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చింది. సంఘటన తర్వాత భద్రతా దళాలు ప్రజలను ఘటనాస్థలానికి.. దూరంగా ఉంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి.
Also Read: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ ప్రమాదం భారత వాయుసేనకు తీరనిస్థాయిలో విషాదాన్ని మిగిల్చింది. మరిన్ని వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. విమాన ప్రమాదం వెనకున్న అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అంతవరకూ ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.
Sad news coming in from Churu in Rajasthan.
An IAF Jaguar aircraft has crashed.
Videos and pictures from the ground are horrendous. pic.twitter.com/V3MkGwNYX1
— Snehesh Alex Philip (@sneheshphilip) July 9, 2025
BREAKING: Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh; rescue team on the spot pic.twitter.com/071ADfWGH5
— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2025