E-Paper
Advertisement

సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే!- అమిత్ షా

సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే!- అమిత్ షా
Advertisement

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో నిర్వహించిన ఒక బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ విమర్శలు గుప్పించారు.

వందేమాతరం వివాదం.. అమిత్ షా డిమాండ్

Advertisement

స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయాన్ని అవమానించిందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనను దేశ ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారని, ఇటువంటి చర్యలు అత్యంత సిగ్గుచేటని పేర్కొన్నారు. జాతీయ గేయాన్ని అవమానించినందుకు గాను సోనియా గాంధీ వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన ఈ పొరపాటును దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని వ్యాఖ్యానించారు.

ర్యాలీకి ముందు ఉద్రిక్తత.. ముందస్తు అరెస్టులు

Advertisement

అమిత్ షా చిత్తోర్‌గఢ్ పర్యటనకు ముందే అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రమంత్రి పర్యటనను అడ్డుకోవడానికి, నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన 24 మంది కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు విద్యార్థులను రాజస్థాన్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ముట్టడి

ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారాలు, దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడుల ఘటనలపై కేంద్ర హోంమంత్రి స్పందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

Also Read: భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×