Anil Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన నివాసాలు, ఆఫీసుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అంబానీ ఈడీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. మరోవైపు అనారోగ్యం కారణంగా ఆయన తల్లి కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ALSO READ: Indian Navy Jobs: పదితో ఇండియన్ నేవీలో భారీగా జాబ్స్.. దరఖాస్తుకు చివరి తేది ఇదే
బ్యాంక్ మోసం కేసులో రిలియన్స్ గ్రూప్ ఛైర్మన్ కు సంబంధించిన కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. అనిల్ గ్రూపుకు చెందిన కంపెనీలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై అనిల్ అంబానీపై కేసు నమోదయ్యింది. ఇంతకుముందే ఆయన ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం ఆయనను దాదాపు 10 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. మనీలాండరిగ్ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది.
ALSO READ: Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం