Bhagavad Gita: భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భరతముని రాసిన నాట్య శాస్త్రానికీ ఆ గౌరవం దక్కింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్-2025లో రెండింటికీ చోటు కల్పించింది. యునెస్కో. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పరిణామమంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం దేశ నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
భగవద్గీతను భవిష్యత్ తరాలకు అందేలా సంరక్షించేందుకు.. అంతర్జాతీయ సహకారంతో పాటు నిధుల సమీకరణకు యునెస్కో గుర్తింపు ఉపయోగపడుతుంది. గ్రంథం చారిత్రక, సాంస్కృతిక విలువను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం చేసేందుకు దోహదపడుతుంది. యునెస్కో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, పరిశోధకులు, స్కాలర్లు.. భగవద్గీత తాత్విక, సాహిత్య, చారిత్రక అంశాలపై మరింత అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతపై అవగాహననూ పెంచుతుంది. అంతేకాదు, పురాతన లిపుల్లో ఉన్న భగవద్గీత డిజిటలైజేషన్ కూడా.. యునెస్కో గుర్తింపు వల్ల సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తైతే.. భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మరింత సులభంగా అందుబాటులో ఉంటుంది.
కాగా ఇటీవల వరల్డ్ హెరిటేజ్ కమిటీ(యునెస్కో).. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన సంగతి తెలిసిందే. ములుగు జిల్లాలోని రామప్ప రుద్రేశ్వర ఆలయం అరుదైన ఖ్యాతి గడించింది. కాకతీయ కళా వైభవానికి ప్రతీక ఇది. ఇక తాజాగా భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది.
Also Read: ముస్లింలను అవమానించాడు.. నటుడు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా ముస్లిం మత పెద్ద ఫత్వా
‘‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ‘ఎక్స్’ఖాతాలో తెలిపారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా షేర్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.
A proud moment for every Indian across the world!
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
— Narendra Modi (@narendramodi) April 18, 2025
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి అని తెలుగు ప్రజలంతా చెప్పుకుంటారు. ఎందుకంటే భారతం అనేది కేవలం కథ మాత్రమే కాదు.. జీవన పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, అడుగడుగున ఎదురయ్యే కపట నాటక సూత్ర ధారులు, ఆస్తుల పంపకాలు, అన్నదమ్ముల అనుబంధం, మాతృమూర్తి మీద అంచలంచల విశ్వాసం, వెలకట్టలేని కుటుంబ బాంధవ్యాలు ఇలా అనేక మైన అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. అందుకే భారతాన్ని పంచమ వేదం అన్నారు. అందులోని చిన్న భాగమే భగవత్గీత. భగవత్గీతలో 700 పైగా శ్లోకాలు ఉన్నాయి. ఒక్కో స్లోకం ఒక్కో అద్భుతమైన జీవన సందేశాన్ని వివరిస్తుంది. మహాభారత యుద్ధం జరిగే ముందు రెండు పక్షాల సైన్యాల నడుమ శ్రీ కృష్ణుడు, అర్జునుడి మధ్య జరిగిన సంభాషణల సారాంశమే భగవత్గీత. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సవివరణమైన సమాధానాలు, సంతృప్తి కరంగా వివరించి కార్యోణ్మకుడిని చేశారు.