BigTV English

Yogi Adityanath: లోక్ సభ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ బిజేపీ కొంపముంచింది.. పార్టీ మీటింగ్‌లో యూపీ సీఎం

లోక్ సభ ఎన్నికల తరువాత మొదటిసారి ఉత్తర్ ప్రదేశ్ బిజేపీ కార్యకర్తల సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ మీటింగ్‌లో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బిజేపీకి అనుకున్న దానికంటే తక్కువ సీట్లు వచ్చాయని.. దానికి కారణం.. ఓవర్ కాన్ఫిడెన్స్ (అతి విశ్వాసం) ఉండడమేనని చెప్పారు.

Yogi Adityanath: లోక్ సభ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ బిజేపీ కొంపముంచింది.. పార్టీ మీటింగ్‌లో యూపీ సీఎం

Yogi Adityanath: లోక్ సభ ఎన్నికల తరువాత మొదటిసారి ఉత్తర్ ప్రదేశ్ బిజేపీ కార్యకర్తల సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ మీటింగ్‌లో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బిజేపీకి అనుకున్న దానికంటే తక్కువ సీట్లు వచ్చాయని.. దానికి కారణం.. ఓవర్ కాన్ఫిడెన్స్ (అతి విశ్వాసం) ఉండడమేనని చెప్పారు.


2024 లోక్ సభ ఎన్నికల్లో బిజేపీకి ఉత్తర్ ప్రదేశ్‌లో 33 సీట్లు వచ్చాయి. అదే 2019 ఎన్నికల్లో బిజేపీకి 62 సీట్లు దక్కాయి. అంటే బిజేపీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ గణాంకాలు చూపుతూ.. యోగి ఆదిత్యనాథ్ పార్టీ తప్పులను గుర్తించి.. వాటిని సరిదిద్దుకునే చర్యలు చేపట్టాలని కార్యకర్తలను సూచించారు.

Also Read: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య


బిజేపీకి 2014 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో ఓట్ షేర్ తగ్గలేదని, కానీ ప్రతిపక్ష పార్టీల ఓటు పెరిగిందని వ్యాఖ్యానించారు. బిజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా కష్టపడి ఉంటే మరిన్ని సీట్లు బిజేపీకి దక్కేవేనని అన్నారు. పార్టీ సునాయసంగా గెలుస్తుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ భావనే దెబ్బతీసిందని చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో ఉత్తర్ ప్రదేశ్‌లో బిజేపీ కార్యకర్తలు, నాయకులు.. ప్రతిపక్షాలపై గత పది సంవత్సరాలుగా ఒత్తిడి పెంచాయని.. కానీ తాజాగా ప్రతిపక్షాల బలం పెరుగుతోందని వ్యాఖ్యాంనించారు.

దేశంలోని ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో 13 సీట్లలో 10 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకోగా.. బిజేపీకి రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే యూపీ సిఎం ఆదిత్యనాథ్.. ఎన్నికల్లో బిజేపీ చేసిన తప్పులను ఎత్తిచూపడం గమనార్హం.

Also Read: తమిళనాడు బిఎస్పీ నాయకుడి హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ప్రజలను కులం పేరుతో ప్రతిపక్షాలు విభజించాయని.. ఇది మహాపాపమని.. భవిష్యత్తులో దీనివల్ల తీవ్రనష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. మన సమాజంలో విభజన వస్తే.. అది చెల్లా చెదరవుతుంది.. కానీ ఐకమత్యం వస్తే.. పెద్ద శక్తులే మోకరిల్లుతాయని గుర్తుచేశారు.

సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి
బిజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాను పూర్తిగా వినియోగించడం నేర్చుకోవాలని.. ప్రతిపక్షాలు తమ పార్టీ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని.. ఆ విషప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా మంచి ఆయుధమని ఆదిత్యనాథ్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు బిజేపీ గెలిస్తే.. రిజర్వేషన్లు తొలగించేస్తుందనే అబద్ధాలు ప్రచారం చేసిందని.. దాని వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని అన్నారు.

Also Read: విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×