Tollywood Best Family Movies on OTT : కొన్ని సినిమాలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. వాటిని చూస్తున్నంత సేపు ఫ్యామిలీ తప్ప మరొకటి గుర్తుకురాదు. అటువంటి సినిమాలు చూస్తున్నంత సేపు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే అటువంటి సినిమాలు వస్తూ ఉంటాయి.ఈ సినిమాలను మాత్రం మిస్ కాకుండా చూడాలి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో అటువంటి బెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శతమానం భవతి (Sathamanam Bhavati)
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీకి సతీష్ విగ్నేషన్ దర్శకత్వం వహించాడు. పిల్లలను చదివించి పెంచిన తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా అమెరికాలో ఉంటారు. ఇంటికి ఎప్పుడు వస్తారో కూడా తెలియకుండా ఆ ముసలి తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ వారి ఆశలు నిరాశ అవుతూ ఉంటాయి. ఈ మూవీ చూస్తే ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు పడే బాధను చూస్తే కంటతడి పెట్టే విధంగా ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం జి ఫైవ్ (Zee5) యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (seethamma Vakitlo Sirimalle Chettu)
విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య సంబంధాన్ని చాలా గొప్పగా చూపించారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ ను చూస్తే మనుషులు ఇలా ఉంటే ఎంత మంచిగా ఉంటుందో అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగించింది. అంత అద్భుతంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుంది. డబ్బే ముఖ్యం అనుకునే బంధువులకి, మంచితనమే మనిషికి అందం అని ప్రకాష్ రాజ్ ఈ మూవీలో నిరూపిస్తాడు.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ లో బెస్ట్ మూవీ గా ఈ మూవీని చెప్పుకోవచ్చు.
సంక్రాంతి (Sankranti)
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, శివ బాలాజీ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీకి ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. ఈ మూవీ కుటుంబంలోని అన్నదమ్ముల విలువ ఎలా ఉండాలో చెప్పకనే చెప్తుంది.యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. సంక్రాంతి పేరు వినగానే ఈ మూవీ పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇటువంటి సినిమాలు ఫ్యామిలీతో కలిసి వీకెండ్ లో అప్పుడప్పుడూ చూస్తే, మనసుకు ప్రశాంతతతో పాటు ఫ్యామిలీ విలువలు కూడా తెలిసి వస్తాయి. ఈ కంప్యూటర్ యుగంలో తల్లిదండ్రులకు, కుటుంబాలకు, ఇస్తున్న విలువ కేటాయిస్తున్న సమయం రోజురోజుకూ తగ్గిపోతుంది. కనీసం అప్పుడప్పుడు ఇటువంటి సినిమాలు చూస్తే కాస్తయినా కుటుంబానికి సమయం కేటాయించగలరు. ఈ వీకెండ్ మరోసారి ఈ సినిమాలను చూసి ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వండి.