Viral Video: మద్యం మనిషిని ఏమైనా చేస్తుంది. ఆ మత్తు కన్నవాళ్లని పొట్టన పెట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. ఆ యువకుడు చదివాడు.. మద్యం మత్తుకు బానిసై ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చివరకు తండ్రిని సైతం వదల్లేదు. పట్టరాని కోపంతో అర నిమిషంలో 15 కత్తిపోటు పొడిచాడు. సంచలనం రేపిన ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద బజార్ జిల్లాలో నరేంద్రసింగ్ చావ్లా అనే వ్యక్తి వికలాంగుడు. అతడికి చిన్న వాచీల షాపు ఉంది. దాని మీద వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. అతడికి కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు అమర్జీత్ సింగ్ చావ్లా. బాగానే చదవాడు, టీచర్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. తప్పుడు ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.
చివరకు తండ్రిని నిందించడం మొదలుపెట్టాడు. తండ్రి వల్లే తన జీవితం నాశనం అయ్యిందని మద్యం మత్తులో వాగేవాడు. జూన్ 17న అకస్మాత్తుగా కొడుకు అమర్జీత్ చావ్లా బైక్ పై నేరుగా షాపులోకి ఎంట్రీ ఇచ్చాడు. షాపు నుంచి నరేంద్రసింగ్ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తనతో తెచ్చుకున్న కత్తితో మెడపై అర నిమిషంలో 15 కత్తిపోట్లు పొడిచాడు.
పెద్దాయన అలాగే నిలబడి ఉండిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొడుకు అమర్జీత్ సింగ్‌ని అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రసింగ్ చావ్లా ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ALSO READ: రూ. 160 కే హోటల్ రూమ్, బుకింగ్ ఇదెక్కడరా బాబు
తండ్రిని తొలుత కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచి పొడిచి తన కోపాన్ని తీర్చుకున్నాడు. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శరీరంలోకి లోతుగా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. తండ్రి కారణంగా తన ఫ్యామిలీకి సమస్యలు వచ్చాయంటూ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సాక్షులకు ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
कलयुगी बेटे का हैवानियत भरा रूप!
छत्तीसगढ़ के रायपुर में नशे में धुत बेटे ने अपने ही पिता पर चाकू से ताबड़तोड़ वार कर दिया।
पूरा घटनाक्रम CCTV में कैद – देखकर रूह कांप जाए!#Raipur #Chhattisgarh#Crime #viralvideo #CCTVFootage#Iran #JHOPE #Israel pic.twitter.com/WEtHq202ft
— First Headline (@FirstHeadl24x7) June 20, 2025