E-Paper
Advertisement

వివాదంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్.. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

వివాదంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్.. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Gyanesh Kumar Family: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్.. ప్రస్తుతం రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారారు. సర్ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ అమలులో ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్ల సలహాలను పక్కనబెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని కథనాలు వెలుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ ఫ్యామిలీ నేపథ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన కుటుంబంలోని అందరూ సివిల్ సర్వెంట్లు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

జ్ఞానేష్ కుమార్ (సీఈసీ)

1988 కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్.. ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. కేంద్ర హోమ్‌శాఖ, సహకార శాఖల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా, ఆపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

మేధా రూపమ్ (పెద్ద కుమార్తె)

Advertisement

షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన మేధా.. 2013 యూపీఎస్సీ పరీక్షల్లో పదవ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని నోయిడా జిల్లా కలెక్టర్ గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు.

అభిశ్రీ (చిన్న కుమార్తె)

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివిన ఈమె.. 2017 యూపీఎస్సీ పరీక్షల్లో 297వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్ (ఐటీ) అధికారిణిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

మనీష్ బన్సల్ (పెద్ద అల్లుడు)

Advertisement

ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన మనీష్.. 2014 కేడర్ ఐఏఎస్ అధికారి. యూపీఎస్సీలో 53వ ర్యాంకు సాధించిన ఈయన ప్రస్తుతం ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్నారు.

అక్షయ్ లబ్రూ (చిన్న అల్లుడు)

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అక్షయ్ 2017లో మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. శిక్షణ సమయంలో అభిశ్రీతో పరిచయం ఏర్పడి.. 2020లో వివాహం చేసుకున్నారు.

Also Read: చాక్లెట్ల పేరుతో ఆటపట్టించి.. ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్టులు.. ఈ బాస్ బంగారం బాబోయ్!

సోదరుడు, బావమరిది సైతం..

వీరితో పాటు జ్ఞానేష్ కుమార్ సోదరుడు మనీష్ కుమార్ ఐఆర్‌ఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆయన బావమరిది ఉపేంద్ర జైన్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా ఉన్నత స్థానంలో ఉన్నారు.

Also Read: మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

Tags

Related News

నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

పెళ్లికి నో చెప్పాడని.. పోలీసైన తండ్రినే కాల్చేశాడు.. 18 ఏళ్ల కొడుకు ఘాతుకం!

యువతి టీ-షర్ట్‌పై ‘Urban Mindset’ నోట్.. అర్ధరాత్రి రెచ్చిపోయిన పోకిరీలు.. కారులోకి లాగేందుకు యత్నం!

పీఎం మోదీతో మహిళ డీప్‌ఫేక్ ఫోటో.. ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు!

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు!

బిహార్‌లో మళ్లీ బరితెగించిన ఆకతాయిలు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై వికృత దాడి!

యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!

Big Stories

Advertisement
×