E-Paper
Advertisement

కారు బోల్తా.. మద్యం కోసం ఎగబడిన జనం, ఇంతకీ ఎక్కడో తెలుసా? వీడియో వైరల్

కారు బోల్తా.. మద్యం కోసం ఎగబడిన జనం, ఇంతకీ ఎక్కడో తెలుసా? వీడియో వైరల్
Advertisement

Patna: చట్టాలు పేరుకే.. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అలాంటి వాటిలో మద్యపాన నిషేధం ఒకటి. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్న బీహార్‌లో వింత ఘటన బయటపడింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. ఫలితంగా రోడ్డుపై పడిన మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు జనం. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాకు కూతవేటు ప్రాంతంలో జరిగింది. అసలు ఏం జరిగింది?

మద్యపాన నిషేధం అమల్లోవున్న బీహార్‌లో వింత ఘటన

శుక్రవారం బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలోని జాతీయ రహదారిపై మద్యంతో నిండిన ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులోని మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు, వాహనాదారులు అక్కడికి చేరుకున్నారు. మద్యం బాటిళ్లను ఏరుకోవడం మొదలుపెట్టారు. రోడ్ల మీద చిల్లర పైసలు ఏరుకున్నట్లుగా తమ చేతికి దొరికిన మద్యంబాటిళ్లను పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. చివరకు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న ఓ ఆటో కూడా పక్కన ఆపి, అందులోని డ్రైవర్ మద్యం బాటిళ్ల కోసం పోటీపడ్డాడు. ఘటన తర్వాత మద్యం స్మగ్లర్ వాహనాన్ని అక్కడ వదిలి పరారైనట్లు సమాచారం.

పాట్నాలో మద్యం తరలిస్తున్న కారు ప్రమాదం

Advertisement

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఖుస్రుపూర్ పోలీసులు, అక్కడికి చేరుకున్నారు. BR 01 FL 8170 రిజిస్ట్రేషన్ నంబర్ గల కారుని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని స్మగ్లర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మద్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడికి వెళ్తోందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఘటన బిహార్‌లో మద్యం స్మగ్లింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై స్థానికులు ఏం చెబుతున్నారు. ప్రమాదం తర్వాత కారులోవున్న మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. ఆ తర్వాత జనం అక్కడ గుమిగూడటం ప్రారంభించారు. తొలుత ఎవరో ఒకరు డిక్కీలోంచి మద్యం బాటిళ్ల బాక్స్‌ను బయటకు తీయడం స్థానికులు గమనించారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు ప్రమాద ప్రాంతానికి చేరుకుని కారు దగ్గరకు చేరుకుని మద్యాన్ని తీసుకోవడం మొదలుపెట్టారని చెబుతున్నారు.

 

కారు స్వాధీనం.. పోలీసులు దర్యాప్తు

Advertisement

బీహార్‌లో మద్యపాన నిషేధంపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తాయి . ప్రజలు మద్యం సీసాలను దోచుకోవడం చూస్తుంటే సామాజిక బాధ్యతపై చర్చను రేకెత్తించింది. పోలీసులు మద్యం అంతా అమ్మేస్తారని, దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆనందించడమే మంచిదని కొందరు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వస్తువులను పట్టుకెళ్లడం ఇటీవలకాలంలో చూస్తున్నాము. చాలామంది డ్రైవర్లు తమ వాహనాలను ఆపి మద్యాన్ని తీసుకోవడం గమనార్హం.

ALSO READ: కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

 

 

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×