E-Paper
Advertisement

కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!
Advertisement

Maharashtra Tragedy: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్త ఫోన్ కోసం తండ్రి, కొడుకు మధ్య తలెత్తిన వివాదం.. ముగ్గురు ప్రాణాలను బలికొంది. వాలుజ్ ఎంఐడీసీ(Waluj MIDC) పరిధిలోని తిస్గావ్ గుట్ట (Tisgaon)పై నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకి ప్రాణాలు విడిచారు.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్టా ఫాటా (Zalta Phata) ప్రాంతానికి చెందిన మురళీధర్ చాంద్గుడే (48), సంగీత దంపతులకు 19 ఏళ్ల కుమారుడు కునాల్ ఉన్నాడు. కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన కునాల్ ఆవేశంగా తిస్గావ్ గుట్టపైకి వెళ్లాడు. అటు తల్లిదండ్రులు సైతం కుమారుడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చేందుకు గుట్ట పైకి ఎక్కారు.

కొండ అంచున నిలబడి..

Advertisement

అయితే గుట్టపైకి వెళ్లగానే కునాల్ కిందికి దూకేస్తానని తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభించాడు. కొండ అంచున ప్రమాకరంగా నిలబడి పేరెంట్స్ తో వాగ్వాదానికి దిగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గుట్ట కింద రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే కునాల్ రక్షణ వలయం ఉన్న ప్రాంతం నుంచి దూరంగా జరుగుతూ.. చానిపోతానని మరింత బెదిరించాడు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

Also Read: ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కొడుకును కాపాడబోయి..

Advertisement

అలా సమయం గడిచేకొద్ది పరిస్థితి మరింత విషమించింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కొడుకును దగ్గరకి తీసుకునేందుకు తండ్రి మురళీధర్ ముందుకు వెళ్లగా.. కునాల్ ఒక్కసారిగా కొండపై నుంచి కిందికి దూకేశాడు. అతడ్ని పట్టుకునేందుకు వేగంగా ముందుకు కదిలి మురళీధర్ సైతం నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఇద్దరూ అమాంతం పైనుంచి కిందకి పడిపోయారు. భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోవడం చూసి సంగీత సైతం మనో వేదనతో పై నుంచి కిందికి దూకేసింది. దీంతో శరీరాలు పడ్డ ప్రాంతానికి పోలీసులు చేరుకొని.. మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×