CBSE New Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ విద్యార్థులకు షాకిచ్చేలా నిర్ణయాన్ని ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి 10 నుంచి ఇంటర్ వరకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మారిన పాఠాలను బోర్డు అకాడమిక్ వెబ్ సైట్‌లో చూడవచ్చు. అయితే 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
సీబీఎస్ఈ కొత్త సిలబస్
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త సిలబస్‌ను ముద్రించినట్టు తెలిపింది. ఇకపై పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. 2026 ఫిబ్రవరి 17న బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందని తెలిపింది.
పదో తరగతి పరీక్షలో 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 మార్కులు అంతర్గత మదింపుకు ఆధారంగా కేటాయిస్తారు. ప్రతి పరీక్షలో కనీసం 33 మార్కులు విద్యార్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు మార్కులు ఇచ్చేవారు. దానికి అనుగుణంగా 9 పాయింట్ల గ్రేడ్ విధానాన్ని అమలు చేయనుంది. ఇంటర్‌లో 9 పాయింట్ల గ్రేడ్ విధానం అమలుకానుంది.
ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఏడాదికి ఒక్కసారి పరీక్షలు రాయనున్నారు. సీబీఎస్ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని బోర్డు ఓ అంచనా వేసింది. 9 నుంచి ఇంటర్ వరకు అకాడమిక్ కంటెంట్, పరీక్షల సిలబస్, అభ్యసన ఫలితాలు, సిఫార్సు చేసిన బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక సమగ్ర మార్గదర్శకాలను అందిస్తుందని డైరెక్టర్ వెల్లడించారు.
ALSO READ: బడా వ్యాపారవేత్తలకు రూ. 16 లక్షల కట్లు రుణమాఫీ.. కేంద్రంపై రాహుల్ ఎదురుదాడి
భాషా సబ్జెక్టులపై స్పష్టత ఇచ్చింది సీబీఎస్ఈ. టెన్త్‌లో ఇంగ్లీష్ లేదా హిందీ భాషలను ఎంచుకోవాలని స్పష్టం చేసింది. తొమ్మది లేదా 10వ తరగతిలో ఈ రెండు భాషల్లో ఒక దాన్ని విద్యార్థులు ఎంచుకోవాలి. ఈ మార్పులు విద్యార్థులు తమ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఆవిష్కరణాత్మకంగా, సృజనాత్మకంగా, సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నది బోర్డు మాట.
ఇంటర్ విద్యార్థులకు..
ఇంటర్ ఫస్టియర్ పరీక్ష తర్వాత బోర్డు ఉత్తీర్ణత పత్రాలను జారీ చేయదు. విద్యార్థులు రెండో పరీక్షకు హాజరు కాకపోతే 11వ తరగతి ప్రవేశానికి డిజిలాకర్ ద్వారా అందించిన పని తీరు వివరాలు ఉపయోగించుకోవాలి. రెండో పరీక్ష ఫలితం వచ్చిన తర్వాతే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో విజయం సాధించిన వారిని 12వ తరగతిలో చేర్చుకోవచ్చు. కాకపోతే సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాల ఆధారంగా వారి ప్రవేశాలను ఖరారు చేస్తామన్నారు.
బోర్డు పరీక్షల కోసం పాఠశాలలు అభ్యర్థుల జాబితాలను సమర్పించినప్పుడు పరీక్ష ఫీజును అప్పుడు డిసైడ్ చేస్తామన్నారు. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్- 2023లోని సిఫార్సుల ప్రకారం విభిన్న అభ్యసన అవసరాలను తీర్చడానికి సరళమైన బోధనా పద్ధతులను అమలు చేయాలని పాఠశాలలకు సీబీఎస్ఈ సూచించింది. అభ్యసనను మరింత ఆకర్షణీయంగా- అర్థవంతంగా చేయడానికి పాఠశాలలు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, విచారణ-ఆధారిత విధానాలు, సాంకేతిక ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రస్తావించింది.