BigTV English

Sunita Kejriwal: నా భర్తను వేధిస్తున్నారు.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.. సునీతా కేజ్రీవాల్

Sunita Kejriwal: నా భర్తను వేధిస్తున్నారు.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.. సునీతా కేజ్రీవాల్

Sunita KejriwalSunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన భార్య సునీతా ఆరోపించారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.


లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో ఆయన ఆరోగ్య క్షీణిస్తుందని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ కు మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించే కొన్ని క్షణాల ముందు ఆమె తన భర్త ఆరోగ్యంపై ఈ వ్యాఖ్యలు చేశారు.

జైల్లో సీఎం కేజ్రీవాల్ ను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదని, ఆయన చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయని, ఆయన్ను వేధిస్తున్నారని తెలిపారు. ప్రజలు దీనికి తగిన సమాధానం త్వరలోనే ఇస్తారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించే కొన్ని క్షణాల ముందు రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: Rameshwaram cafe Blast: రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్ కేసు.. కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..

కాగా, మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. మార్చి 28న తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే గురువారంతో ఆయన విచారణ ముగియగా.. నేడు మరలా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు మరో 7రోజులు కస్టడీ అడిగారు. దీన్ని నిరాకరించిన కోర్టు 4రోజులు మాత్రమే కస్టడీకి అప్పగించింది. తిరిగి ఏప్రిల్ 1వ తేదీనా కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.

Related News

Online Games Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం.. అలా చేస్తే కోటి రూపాయల జరిమానా

Mumbai floods: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి, పోలీసుల అదుపులో నిందితుడు, ఏం జరిగింది?

PM Removal Bill: ప్రజాప్రతినిధులపై కొత్త చట్టం.. ప్రధాని నుంచి మంత్రుల వరకు, కేవలం 30 రోజుల్లో

Vice President Election: వైస్ ప్రెసిడెంట్ పోరు.. చివరి నిమిషంలో ట్విస్ట్..! క్రాస్ ఓటింగ్ తప్పదా?

Online Gaming Bill: ఆన్‌లైన్ బెట్టింగులపై కేంద్రం ఉక్కుపాదం.. తెలుగు రాష్ట్రాలకు రిలీఫ్, చైనాకు ఝలక్

Big Stories

×