BigTV English

Delhi Liquor Case: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు

Delhi Liquor Case: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు

arvind kejriwal news latestDelhi Liquor Case updates(Telugu news headlines today): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.15వేల పూచికత్తుపై ఈ మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన కోర్టును నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. అయితే ఈకేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కే. కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.


దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ అధికారులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదులు చేశారు. దీంతో మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు నిరాకరించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులు అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇప్పటివరకు 8 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను కేజ్రీవాల్ 8 సార్లు దాటవేస్తూ వచ్చారు. ఈడీ అధికారులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో రెండు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ చేసిన ఫిర్యాదులపై విచారణను ఎదుర్కొనేందుకు మార్చి 16న తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరారించింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాలంటే శనివారం జరిగే ట్రయల్‌ కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్రం అధికార పార్టీ అయిన బీజేపీ తనను వేధించేందుకే ఈ కేసులు పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు.


Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో మరో ఉత్సవం.. 24 గంటల పాటు దర్శనం..!

ఈ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు రెండేళ్ల క్రితం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోరు పెంచిన ఈడీ అధికారులు తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈ కేసులో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమెకు రెండు సార్లు మహిళా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×