AirPods Charging Tips: కొత్తగా AirPods కొనగానే దాన్ని ఎలా ఛార్జ్ చేయాలనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. కేబుల్‌తో ఛార్జ్ చేయడం మంచిదా? లేక వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌పై పెట్టడమే బెటరా? అని ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా వైర్‌లెస్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుందనే మాటలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. అసలు ఇందులో నిజమెంత? ఎయిర్‌పాడ్స్ బ్యాటరీ లైఫ్‌కు ఎలాంటి ఛార్జింగ్ పద్ధతి మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
AirPodsను కేబుల్‌తో ఛార్జ్ చేసినా, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌పై పెట్టినా సాధారణంగా ఎలాంటి సమస్య ఉండదు. ఛార్జింగ్ కేస్ అవసరమైన పవర్‌ను మాత్రమే తీసుకునేలా రూపొందించబడింది. బ్యాటరీ పూర్తయ్యాక ఛార్జింగ్‌ను కూడా పరికరం స్వయంగా మేనేజ్ చేస్తుంది. కాబట్టి.. వైర్‌లెస్ ఛార్జింగ్ వాడుతున్నామని ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు.
Also Read: కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?
త్వరగా ఛార్జ్ చేయాల్సి వస్తే కేబుల్ ఛార్జింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. బయటకు వెళ్లే ముందు బ్యాటరీ తక్కువగా ఉంటే కేబుల్‌తో ఛార్జ్ చేయడం మంచి అలవాటు. అయితే డెస్క్ లేదా నైట్‌స్టాండ్‌పై ఎయిర్‌పాడ్స్ కేస్‌ను పెట్టి ఛార్జ్ చేయాలనుకుంటే వైర్‌లెస్ ఛార్జింగ్ చాలా ఈజీగా ఉంటుంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ సమయంలో కొంత వేడి రావడం సహజమే. సాధారణ వినియోగంలో ఇది పెద్ద సమస్య కాదు. అయితే అధిక ఉష్ణోగ్రత మాత్రం బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. అందుకే AirPods కేస్‌ను ఎండలో, నేరుగా సూర్యరశ్మి పడే ప్రదేశంలో లేదా వేడిగా ఉండే కారులో ఎక్కువసేపు ఉంచకపోవడం మంచిది.
మీ ఎయిర్‌పాడ్స్‌లో Optimized Battery Charging ఫీచర్ అందుబాటులో ఉంటే దాన్ని ఆన్‌లో ఉంచడం మంచిది. ఇది మీ ఛార్జింగ్ అలవాట్లను బట్టి ఛార్జింగ్‌ను సర్దుబాటు చేసి, బ్యాటరీని ఎక్కువసేపు 100 శాతం వద్ద ఉంచకుండా సహాయపడుతుంది. మొత్తానికి.. ఛార్జింగ్ స్పీడ్‌గా ఎక్కాలంటే కేబుల్.. సౌకర్యవంతంగా ఉండాలంటే వైర్‌లెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సరైన ఉష్ణోగ్రతలో ఉపయోగిస్తే.. రెండు ఛార్జింగ్ పద్ధతులూ సాధారణంగా సురక్షితమే.
Also Read: ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!