Girija Vyas: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ లోని తన నివాసంలో పూజ చేసేటప్పుడు హారతి నిర్వహస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గాయాలయ్యాయి. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. అయితే అహ్మదాబాద్ నగరం ఉదయ్ పూర్ నుంచి 250 కిలోమీటర్లు దూరంలో ఉంది.
ప్రమాదంపై స్పందించిన గిరిజా వ్యాస్ సోదరుడు
తమ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు బట్టలకు అంటుకున్నాయని చెప్పారు. గమనించిన వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
స్పందించిన మాజీ సీఎం అశోక్ గెహ్లాత్..
గిరిజా వ్యాస్ అగ్నిప్రమాదానికి గురైన వార్తలపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ స్పందించారు. ‘మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన గిరిజా వ్యాస్ గతంలో సెంట్రల్, స్టేట్ లో ముఖ్యమైన పదవులు నిర్వర్తించారు. ఆమె 1985 నుంచి 1990 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన గిరిజా వ్యాస్.. రాజస్థాన్ పర్యాటక మంత్రిగా కూడా చేశారు. 1991లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆ తర్వాత 1996, 1999 లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి.. అనంతరం 2009లో చిత్తోరగఘ్ నుంచి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారు. తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా.. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్ పర్సన్ గా కూడా గిరిజా వ్యాస్ పనిచేశారు.
ALSO READ: SRH vs HCA : టికెట్ల కోసం టార్చరా? సీఎం రేవంత్ సీరియస్.. సీన్‌లోకి సూపర్ పోలీస్
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1003 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువు..