OTT Movie : గ్రామీణ వాతావరణం అంటేనే చూడ చక్కగా ఉంటుంది. అందులోనూ లవ్ స్టోరీతో సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా తెలుగులోనే వచ్చిందండి బాబూ. ప్రేమికులు ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో జరిగే లవ్ స్టోరీని చూపిస్తుంది. ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చి, టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘కన్యాకుమారి’ (Kanya Kumari) 2025లో విడుదలైన తెలుగు రొమాంటిక్ చిత్రం. ఇది శ్రుజన్ అటాడా దర్శకత్వంలో, రాడికల్ పిక్చర్స్ పతాకంపై రూపొందింది. ఇందులో శ్రీచరణ్ రాచకొండ (తిరుపతి, రైతు), గీత్ సైని (కన్యకుమారి) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈసినిమా IMDbలో 9.1/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా 2025 ఆగస్టు 27న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం Aha ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో కన్యాకుమారి అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉంటుంది. కానీ ఇంట్లో డబ్బు సమస్యల వల్ల ఒక షాపింగ్ మాల్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె జీవితం సింపుల్‌గా సాగుతుండగా, తిరుపతి అనే రైతు కొడుకు ఆమె లైఫ్‌లోకి వస్తాడు. తిరుపతి గ్రామంలోనే పుట్టి పెరిగినవాడు, వ్యవసాయం మీద మక్కువ ఉన్నవాడు. ఒకసారి ఇద్దరూ కలిసిన తర్వాత, తిరుపతి కన్యాకుమారి మీద ప్రేమలో పడతాడు. కానీ కన్యకుమారి కలలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించడం చుట్టూ తిరుగుతాయి. ఇంట్లో ఆమె తల్లిదండ్రులు ఆమె కలలకు సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో, తిరుపతి ఆమె కలలకు అండగా నిలబడతాడు.
కానీ గ్రామంలో వీళ్ళ ప్రేమ అనేక అడ్డంకులను ఎదుర్కుంటుంది. ఆ తరువాత కన్యాకుమారి హైదరాబాద్‌లో జాబ్ కోసం ట్రై చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ నుండి వచ్చే ఒత్తిడి, గ్రామంలోని సాంప్రదాయాలు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాయి. తిరుపతి ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఆమె కలల కోసం తన జీవితంలో కొన్ని రిస్క్‌లు కూడా తీసుకుంటాడు. ఈ మధ్యలో కన్యాకుమారి ఇంట్లో ఆమె అన్న ఒక సమస్య సృష్టిస్తాడు. ఆమె ప్రేమ, కలల మధ్య చిక్కుకుంటుంది. క్లైమాక్స్‌లో కన్యాకుమారి ప్రేమ కథ ఒక ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుంది. చివర్లో ఆమె తన కలలను సాధిస్తుందా ? వీళ్ళ ప్రేమ కథ ఏమవుతుంది ? ఈ సినిమా హ్యాపీ ఎండింగ్ ఇస్తుందా ? అనే విషయాలను. ఈ సినిమాను చూసి తెలుసుకోవాలసిందే.
Read Also : మనిషి మాంసం, రక్తం కోసం తహతహలాడే రాక్షస జీవులు… బ్లడీ బ్లడ్ బాత్… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్