Prime Minister Modi: కశ్మీర్‌లోని పెహల్గామ్ టెర్రర్ అటాక్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం ఆయన నివాసంలో దాదాపు గంటన్నర సేపు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, తదితరులు ఉన్నారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని.. కూకటి వేళ్లతో సహా అంతం చేస్తామని ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. భారత సైన్యానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని అన్నారు. పెహల్గామ్ కాల్పులకు తెగబడి అమాయక టూరిస్టులను పొట్టన బెట్టుకున్న నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఆయన తేల్చి చెప్పారు. తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని అన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో కూడా సైన్యమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. భారత సైన్యంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని.. పహల్గామ్ దాడికి ధీటైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Also Read: Pakistan Poverty : పాకిస్తాన్‌కూ అదే గతి పడుతుందా? అఫ్గానిస్తాన్ పేద దేశంగా ఎలా మారిందో తెలుసా?