Govt New Scheme 2025: ట్రెండ్‌కు అనుగుణంగా కేంద్రం తన పాలసీలను మార్చుకుంటోంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మధ్య, నిరు పేదలు చనిపోవడం, లేదంటే బారిన పడి నరక యాతన అనుభవిస్తున్నారు. వారిని ఉద్దేశించి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ. దీనివల్ల లక్షన్నర వరకు ఉచితంగా ట్రీట్ మెంట్ పొందవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
రెండేళ్ల కిందట దేశంలో దాదాపు ఐదు లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1.72 లక్షల మంది ఈ లోకాన్ని దూరమయ్యారు. రోజుకు సగటున 474 మరణాలు అన్నమాట. ప్రతి మూడు లేదా నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. 2022తో పోలిస్తే 2023 నాటికి ప్రమాదాలు 4.2 శాతం పెరగాయి. మరణాలు 2.6 శాతం చేరింది.
రోడ్డు ప్రమాద భాదితులకు కొత్త స్కీమ్
ఏడాదికి లక్షన్నర మందికి పైగానే చనిపోవడం అంటే నార్మల్ విషయం కాదు. రెండేళ్ల కిందట సుమారు 4 లక్షల మంది గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బారిన పడినవారికి తక్షణ వైద్య సహాయం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో క్యాష్‌లెస్ స్కీమ్‌ని తెచ్చింది.
ALSO READ: 100 మంది టెర్రరిస్టులు హతం, అసలు గుట్టు బయటపెట్టిన రక్షణ శాఖ
గడిచిన రెండు మూడేళ్లలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాద బాధితుల కోసం కొత్త పథకాన్ని తెచ్చింది కేంద్ర రోడ్డు రవాణా- రహదారుల శాఖ. ఈ విషయాన్ని ఆ శాఖమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడిచారు. ఈ పథకం వల్ల బాధితులు చికిత్స కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది క్యాష్‌లెస్ పథకం అన్నమాట.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందనుంది. రూ. 1.5 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. మే 5న దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం . దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కీలకమైనది. ప్రమాదం జరిగిన రోజు నుంచి వారం రోజులోపు ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో రూ.1.5 వరకు ఉచితంగా ట్రీట్‌మెంట్ పొందవచ్చు.
క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
జాతీయ ఆరోగ్య అథారిటీ-NHA ఈ పథకాన్ని అమలు చేస్తుంది. పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థలతో కలిసి పని చేస్తుంది. ఈ స్కీమ్ కింద చికిత్సను పొందడానికి ఎలాంటి కాగితాలు అవసరం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్‌లో అంటే సకాలంలో వైద్య సహాయం అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఇలాంటి పథకం ద్వారా బాధితులను కాపాడేందుకు వీలవుతుంది. ఒకవేళ గుర్తింపు పొందని ఆసుపత్రిలో చేరితే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుర్తింపు పొందిన ఆసుపత్రికి తరలిస్తారు.
‘క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్’గా పేరు పెట్టారు. ఈ పథకం అమల్లోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లడం మంచింది. ఈ పథకం సదుపాయం ఆ ఆసుపత్రిలో ఉంటే ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. లేకుంటే అమలులో ఉన్న ఆసుపత్రికి షిఫ్ట్ అవ్వాలి. దీనిపై కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి వుంటుంది.
రాష్ట్ర రోడ్ సేఫ్టీ కౌన్సిల్ దగ్గర ఆసుపత్రుల జాబితా ఉంటుంది. లేకుంటే నేషనల్ హెల్త్ అథార్టీ పోర్టల్‌లో వివరాలు ఉంటాయి. పథకం అమలుపై 17 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రతీ మూడు నెలలకు నివేదిక కేంద్రానికి ఇవ్వనుంది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది.