BigTV English

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Jeep Collided with Vehicle in Indore District: రెండు వాహనాలు పరస్పరం ఢీ కొని.. 8 మంది మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఇండోర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.


అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో ఒక జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా.. ప్రమాదం అనంతరం గుర్తుతెలియని వాహనం డ్రైవర్ పరారైనట్లు ద్వివేది వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: 160 స్పీడులో కారు, వీడియో తీస్తుండగా దారుణం..నలుగురు మృతి


మరోవైపు.. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని చంపువా ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న కారును రెండు ట్రక్కులు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారి 520పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ఒక మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Tags

Related News

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Big Stories

×