Navy day celebrations : విశాఖ కేంద్రంగా భారత్ నావికా దళం ఘనంగా నేవీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు సహా వివిధ రక్షణ రంగ విభాగాలు పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలతో విశాఖ సముద్ర తీరం.. కొన్ని గంటల సేపు యుద్ధ రంగాన్ని తలపిస్తాయి. నేవీ నిర్వహించే కార్యక్రమాలను చూసేందుకు పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఆ రోజు రామకృష్ణ బీచ్ కు పోటెత్తుతుంటారు. అయితే అసలు నేవీ డే ఎందుకు నిర్వహిస్తారు.? విశాఖ కేంద్రంగా వేడుకలు నిర్వహించడానికి కారణాలేంటి? ఏటా డిసెంబర్ 4 నే ఎందుకు వేడుకలు నిర్వహిస్తుంచారు.
అసలు నేవీ డే ఎందుకు నిర్వహిస్తారు
మన దాయాది పాకిస్తాన్ తో 1971 లో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా నేవీ డే వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆ యుద్ధంలో భారత నేవీ కదన రంగంలో తన శక్తి సామర్థ్యాలతో ప్రత్యర్థిని చావు దెబ్బ కొట్టింది. పాకిస్థాన్ ని కోలుకోలేని దెబ్బ తీసి.. దేశానికి విజయాన్ని అందించింది. దాయాది పాక్ ను మట్టి కరిపించిన ఈ యుద్ధంలో నేవీ పాత్ర ఎంతో కీలకం.. అందుకే.. ఆ విజయానికి గుర్తుగా ఏటా నేవీ వేడుకలను నిర్వహిస్తుంటారు.
పాక్ తో యుద్ధానికి కారణాలు ఏంటి.?
భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ప్రత్యేక దేశం కోసం ముస్లిం లీగ్ నేతలు పట్టుబడ్డారు. దేశంలో నిరసనలు, హింసాయిత కార్యక్రమాలకు దిగారు. దీంతో.. భారత్ ను మూడు ముక్కలు చేశారు నాటి పాలకులు. అందులో.. ముస్లిం లీగ్ డిమాండ్ కు అనుగుణంగా ముస్లిం వర్గం కోసం తూర్పున బెంగాల్ ప్రాంతాన్ని, పశ్చిమాన గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుగా మరో ప్రాంతాన్ని విభజించి.. ప్రత్యేక పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ రెండు ప్రాంతాల పరిపాలన మొత్తం ప్రస్తుత పాకిస్థాన్ కేంద్రంగానే నడుస్తూ వచ్చాయి. కానీ 1970 కి వచ్చే వరకు బంగ్లా ప్రాంతంలో పాక్ అధిపత్యానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అక్కడి నుంచి పరిపాలించడం ఏంటని, బంగ్లా ప్రాంతం వనరుల్ని పాక్ దోచుకుంటుంది అనే కారణంగా.. స్వాతంత్య్ర ఉద్యమం మొదలైంది. ఈ పోరాటానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు ప్రకటించారు. దాంతో పాకిస్తాన్ 1971 నవంబర్ 16 న భారత్ పైకి కాలుదువ్వింది. బంగ్లా కూడా తన ఆధీనంలోనే ఉండటంతో అక్కడి నుంచి భారత దళాలపై దాడులను కొనసాగించింది.
పశ్చిమ పాకిస్తాన్ నుంచి 1971 నవంబర్ 30న భారత్ పై దాడులు ప్రారంభించిన పాకిస్థాన్.. డిసెంబర్ 3వ తారీఖున భారత నేవీ స్థావరాల్ని, పోర్టుల్ని టార్గెట్ చేసుకుంది. దాంతో విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికా దళం రంగంలోకి దిగింది. డిసెంబర్ 3 రాత్రి నుంచి డిసెంబర్ 4 ఉదయం వరకు పాకిస్తాన్ నేవీ కి సంబంధించిన నెేవీ మౌలిక వసతుల్ని నాశనం చేసింది. పాకిస్తాన్ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు సహా పాక్ సైన్యానికి చుక్కలు చూపించింది. పాకిస్తాన్ నావికా దళం బలాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.. భారత నేవీ బలమైన దెబ్బ తర్వాత రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్.. యుద్ధ రంగంలో పాకిస్తాన్ సైన్యాన్ని చిత్తుగా ఓడించి.. బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టాయి.
డిసెంబర్ 4 నే వేడుకలు ఎందుకు..?
ఈ యుద్ధాన్ని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంగా పిలుస్తుంటారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 16 మధ్య జరిగిన యుద్ధంలో.. పాకిస్తాన్ బలంపై బలమైన దెబ్బ కొట్టింది డిసెంబర్ 4న. ఈ ఘనతను సాధించింది.. భారత తూర్పు నావికాదళం. ఇలా తన చరిత్రలో గొప్ప విజయానికి కారణమైన డిసెంబర్ 4ను గుర్తు చేసుకుంటూ ఏటా తూర్పునావికా దలం నేవీ డే ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఆ రోజు నావికా దళం తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు భారత తీర ప్రాంతాలని,తన ఆధీనంలోనే పోర్టులను, దేశ సరిహద్దులను రక్షించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమనే సంకేతాన్ని తెలియజేస్తుంటుంది.
ప్రస్తుతం.. జనవరిలో వేడుకలు ఎందుకు..
భారత్ నేవీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు డిసెంబర్ 4. అలాగే.. ఈ విజయానికి నాయకత్వం వహించింది.. తూర్పూ నావికాదళ కేంద్రమైన విశాఖపట్నం. కాబట్టే.. ఈ వేడుకలకు ఏటా విశాఖపట్నం వేదికగా నిలుస్తుంది. కానీ.. ఈ సారి అన్ని ప్రాంతాల వారికి నావికదళ బలాన్ని, శౌర్యాన్ని తెలపడంతో పాటు తూర్పు నావికా దళం ఆధీనంలోని ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో.. ఆయా ప్రాంతాల ప్రజలకు నేవీపై అభిమానం, గౌరవం పెరుగుతుందనే ఉద్దేశ్యంతో.. ఈ ఏడాది ఒరిస్సా కేంద్రం పూరీ క్షేత్రంలో ఈ ఏడాది నేవీ డే వేడుకల్ని నిర్వహించారు.
సంప్రదాయానికి భిన్నంగా ఈసారి వేడుకలను విశాఖపట్నం నుంచి పూరికి మార్చారు. ఈ కారణంగానే ఇప్పుడు మరోసారి విశాఖపట్నం వేదికగా విశాఖలో మరోమారు ఉత్సవాలు చేయాలని తూర్పు నావికా దళం నిర్ణయించింది. ఇప్పటికే నేవీ డే వేడుకలు పూర్తయిన.. మరోమారు విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం, ఇక్కడ ఏటా నిర్వహిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరోసారు విశాఖలో నేవీ డే వేడుకలను నిర్వహిస్తున్నారు.