KA Paul Viral Video: మొత్తానికి ఇండియా- పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి పులిస్టాప్ పడింది. మిసైల్స్, డ్రోన్ల అటాక్ లు, కాల్పుల మోతలు ఆగిపోయాయి. దాయాది దేశం కోరిక మేరికు భారత ప్రభుత్వం కాల్పులు విరమణకు ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే రెండు దేశాలు ఒక ఒప్పందానికి కూడా వచ్చిన విషయం తెలిసిందే. భారత్- పాకిస్థాన్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన చర్యలు సఫలం కావడంతో.. రెండు దేశాలు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
ఈ క్రమంలోనే భారత్- పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కీలక పోస్టు చేసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని.. తక్షణ సీజ్ ఫైర్ కు భారత్, పాకిస్థాన్ అంగీకరించినట్టు ఆయన పోస్టులో తెలిపారు. రాత్రంతా భారత్- పాకిస్థాన్ దేశాలతో చర్చించామని అన్నారు. చర్యలు సఫలం అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలకు అభినందనలు కూడా తెలిపిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు స్పందించారు.
కాల్పుల విరమణపై కేఏ పాల్ స్పందన
భారత్-పాక్ ఉద్రిక్తతలపై నమ్మకం కోల్పోకుండా రాత్రీపగలు ప్రార్థించానని తెలిపిన కేఏ పాల్
ఉగ్రవాద దాడులు ఆగాలని హితవు
యుద్ధం ద్వారా నష్టమే కానీ, లాభం లేదని ఓ వీడియో విడుదల చేసిన కేఏ పాల్ #IndiaPakistanConflict #KAPaul pic.twitter.com/tTnVdTbcKm
— BIG TV Breaking News (@bigtvtelugu) May 10, 2025
ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడం ఇది శుభపరిణామమని అన్నారు. నిన్నటి వరకూ ఈ విషయంతో అమెరికా జోక్యం చేసుకోదని చెప్పిందని అన్నారు. అయితే ఎట్టకేలకు తన ప్రార్థనలు ఫలించాయని చెప్పారు. భారత్ – పాక్ కాల్పుల విరమణకు అంగీకరించండం సంతోషకరని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తన ప్రయత్నాలు ఆపలేదన్నారు. రిపబ్లికన్, డెమోక్రాట్లతో ఎప్పుడూ టచ్ లోనే ఉన్నానని చెప్పారు. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం ద్వారా నష్టం తప్పా.. కొంచెం కూడా లాభం ఉండదన్నారు. కానీ మరోసారి దేశంపై టెర్రరిస్టులు దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. శాంతి కొరకు హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్‌లో మే 24న సమావేశం నిర్వహిస్తున్నట్టు కేఏ పాల్ తెలిపారు.
Also Read: India Vs Pakistan War : యుద్ధంతో అమెరికా డబుల్ గేమ్ ఆడిందా? ట్రంప్ ప్లాన్ ఇదేనా?
రెండు దేశాల మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని అన్నారు. ఇండియా – పాక్ శాంతించాలని ప్రార్థిస్తూనే ఉన్నానని చెప్పారు. రాత్రీ పగలు పనిచేస్తూ ఉన్నానని అన్నారు. యుద్ధం చేయడం వల్ల లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు. రూ.లక్షల కోట్లు ఆస్తి నష్టం కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Imran Khan: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?