BigTV English

Operation Sindoor : ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తానీ.. వీడియో వైరల్

Operation Sindoor : ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తానీ.. వీడియో వైరల్

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్. గ్రాండ్ సక్సెస్. టార్గెట్ చేసిన 9 స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. జస్ట్ 25 నిమిషాల్లోనే టాస్క్ ఫినిష్ చేసేసింది. టార్గెట్ కొంచెం కూడా అటూ ఇటు కాలేదు. ప్రయోగించిన మిస్సైల్స్ ఒక్క ఇంచు కూడా డైవర్ట్ కాలేదు. సామాన్య పౌరులు, పాక్ సైనికులకు చిన్న గీత పడలేదు. ఈ మాట చెబుతున్నది మనం కాదు.. ఓ పాక్ పౌరుడు. అందుకే ఇప్పుడు ఆ పాకిస్తానీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాక్ పరువంతా తీస్తోంది. ఇండియా ఇమేజ్ పెంచేస్తోంది.


భారత సైన్యం కచ్చితత్వంతో టార్గెట్‌ను పినిష్ చేసిందని అంటున్నాడు ఆ పాక్ పౌరుడు. ఇజ్రాయిల్, ఇరాన్‌లా దాడులు చేసింటే ఈపాటికి పాక్ శిథిలావస్థకు చేరి ఉండేదని చెబుతున్నాడు. భారత్‌ ఆర్మీ బేస్ క్యాంపులను ధ్వంసం చేశామని పాక్ చెబుతున్నా.. అందులో నిజంలేదంటూ సొంత దేశం ఇజ్జత్ తీసిపడేశాడు.

పాక్ రక్షణ వ్యవస్థపైనా ఆ దేశ పౌరుడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే.. పాక్ కనీసం అడ్డుకోలేకపోయిందన్నాడు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసిందని.. ఒకవేళ పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో భారత్ దాడి చేసినా చేసేదేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇండియాకు సపోర్ట్ చేయడం లేదంటూనే.. పాక్ పరువంతా తీసేశాడు.


పాక్ ఫేక్ ప్రచారం

ఇండియాను ఏం చేయలేక.. సోషల్ మీడియానే నమ్ముకుంది పాకిస్తాన్. పరువు నిలబెట్టుకునేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది. గుజ్రాన్‌వాలాలో భారత్ మిస్సైల్‌ను పాక్ కూల్చేసిందని ఓ వీడియో.. పాక్ అనుకూల మీడియాలో వైరల్ అవుతోంది. అది తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. పాత వీడయోలు వైరల్ చేసి పాక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మిస్సైల్ శిథిలాలను చూపించి భారత్ క్షిపణిగా పాక్ ప్రచారం చేస్తోందని ఆరోపించింది పీఐబీ.

ఫేక్ వీడియోలే దిక్కా?

అమృత్‌సర్‌లోని భారత సైనిక స్థావరంపై దాడులు చేశామని పాక్ మరో వీడియోని కూడా వైరల్ చేస్తోంది. ఇందులో కూడా నిజంలేదని స్పష్టం చేసింది పీఐబీ. 2024 నాటి కార్చిర్చు వీడియోని ప్రసారం చేసి అమృత్‌సర్‌ సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశామని చెప్పుకుంటోందని ప్రకటించింది. తప్పుడు వార్తలకు ప్రభావితం కావొద్దని.. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read : పాకిస్తాన్‌కు కేఏ పాల్.. మోదీతో బిగ్ టాస్క్!

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×