Big Stories

Pawan campaign: గట్టి పోటీ.. అందుకే, రంగంలోకి పవన్..

Pawan campaign: తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార డీఎంకె, విపక్ష అన్నాడీఎంకె మధ్య నువ్వానేనా అన్నరీతిలో ఫైట్ సాగేంది. ఇదంతా ఒకప్పుడు.. మోదీ వచ్చాక పరిస్థితి మారింది.
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతీది హైకమాండ్ గమనిస్తోంది.

- Advertisement -

ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్, దక్షిణ చెన్నై నుంచి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రచారంలో ఆమె కాస్త వెనుకబడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తమిళిసై తరపున ప్రచారం చేయాలని పవన్‌కల్యాణ్ డిసైడ్ అయ్యారట. రేపో మాపో ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండడంతో తమిళిసై.. పవన్‌తో మాట్లాడినట్లు సమాచారం. అందుకు పవన్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. రోడ్ షోతోపాటు బహిరంగ సభకు కూడా పవన్ హాజరుకానున్నట్లు సమాచారం.

- Advertisement -

ఈ నియోజవకర్గం నుంచి అధికార డీఎంకె నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈమెకు రెండున్నర లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చింది. దానికితోడు ఆమె రచయిత కూడా. తన మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడం ఆమె సొంతం. పరిస్థితి గమనించిన బీజేపీ, ఇక్కడి నుంచి తమిళిసైను రంగంలోకి దింపింది. తమిళిసై.. డీఎంకెకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని కమలనాధుల ఆలోచన.

ALSO READ:  ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అన్నాడీఎంకె నుంచి మాజీ మంత్రి జయకుమార్ కుమారుడు జయవర్థన్ రేసులో ఉన్నారు. 2009, 2014 జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకె అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు. మరి ముక్కోణపు పోటీలో దక్షిణ చెన్నైపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News