E-Paper
Advertisement

శ్రీకాకుళంలో భారతమాతే గ్రామదేవత.. కపాసుకుద్ది ఆలయ చరిత్ర ఇదే!

శ్రీకాకుళంలో భారతమాతే గ్రామదేవత.. కపాసుకుద్ది ఆలయ చరిత్ర ఇదే!
Advertisement

Bharat Mata Temple: స్వాతంత్రం వచ్చినపుడు దేశంలో మొత్తం సంబరాల్లో తేలిపోయింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, కపాసుకుద్ది గ్రామం మాత్రం మసూచితో విషాదంలో ముగినిపోయింది. కొన్ని రోజుల్లోనే చాలా మంది చనిపోయారు. దీంతో గ్రామస్థులకు ఏం చేయాలో తెలియలేదు. తమ ప్రాణాలను ఎవరు కాపాడుతారా అని ఎదురు చూశారు. గ్రామస్తులంతా కలిసి ఊరిలోని పూజారుల దగ్గరకు వెళ్లారు. గ్రామానికి భారతమాత ఆవహించిందని.. అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయాలని వారు చెప్పారు.

భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు..

Advertisement

పూజాలు చెప్పినట్టుగానే గ్రామస్తులు భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. నిజంగానే భరతమాత కాపాడిందా లేదా మరేమైనా కారణం ఉందో తెలియదు కానీ గ్రామస్థుల్లో ఆ విశ్వాసం బలపడింది. అప్పటి నుంచి కపాసుకుద్దిలో భారతమాతనే గ్రామదేవతగా కొలుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భావిస్తున్నారు.

ఈ ఆలయానికి మరో ప్రత్యేకత

Advertisement

గ్రామంలోని ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అక్కడ అమ్మవారికి మహిళా పూజారే అన్ని కార్యక్రమాలు చేస్తారు. తరతరాలుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రతిరోజూ భరతమాతకు దీపారాధన, ప్రతి గురువారం భజన కచేరీలు నిర్వహిస్తారు. కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఉత్సవాలను జరుపుతారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అమ్మవారిని నమ్ముకునే బయలుదేరుతారు. తాము ఎక్కడ ఉన్నా భరతమాత తమను కాపాడుతుందనే నమ్మకం వారిలో బలంగా కనిపిస్తుంది. ఇంతటి ప్రత్యేక చరిత్ర కలిగిన భారతమాత ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also Read: మౌలాలి MS ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీ.. రూ. 17 కోట్ల సరుకు సీజ్!

Tags

Related News

న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!

ఏపీలో మొదలైన మరో కొత్త పొలిటికల్ వార్.. బలైపోతున్న నిరుద్యోగులు!

కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో షాకింగ్ ట్విస్ట్.. S-షేప్ రోడ్డు మలుపుల వెనుక ఉన్న నిజాలివే!

మోదీ విదేశాంగ విధానం పై రాహుల్ గాంధీ సెటైర్లు..!

నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!

Big Stories

Advertisement
×