E-Paper
Advertisement

అనాడు ప్రేమికులు.. నేడు సీఎం దంపతులు.. 34 ఏళ్లనాటి స్వీట్ మెమోరీస్!

అనాడు ప్రేమికులు.. నేడు సీఎం దంపతులు.. 34 ఏళ్లనాటి స్వీట్ మెమోరీస్!
Advertisement

CM Revanth Love Story: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనగానే అందరికి పట్టువదలని విక్రమార్కుడే గుర్తుకు వస్తారు. అనుకున్నది సాధించేవరకు ఆయన నిద్రపోరని.. దానికి నిదర్శనమే జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన తీరని అందరూ చెబుతుంటారు. అయితే ఫైర్ బ్రాండ్ గా ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డి లైఫ్ లో ఓ స్వీట్ లవ్ స్టోరీ ఉందన్న సంగతి చాలా మందికే తెలుసు. సోమవారం నాగార్జున సాగర్ వద్ద భార్య గీతారెడ్డితో కలిసి వరుణయాగం చేసిన సందర్భంగా వీరి ప్రేమ పెళ్లికి సంబంధించిన ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పొత, కొత్త ఫొటోలు వైరల్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన భార్య గీతారెడ్డితో కలిసి కృష్ణ నది తీరంలోని నాగార్జున సాగర్ వద్ద సోమవారం వరుణ యాగం చేశారు. అనంతరం అక్కడి విజయ విహార్ గెస్ట్ హౌస్ దగ్గర తమ అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దీంతో వీరి క్యూట్ లవ్ స్టోరీ ఒక్కసారిగా చర్చకు వచ్చింది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం వీరి వివాహం జరగ్గా.. అప్పటి ఫొటోను తాజాగా నాగార్జున సాగర్ వద్ద దిగిన ఫొటోను పక్కపక్కన పెట్టి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Advertisement

34 ఏళ్ల క్రితం అదే చోట..

అయితే సీఎం రేవంత్ రెడ్డి.. భార్య గీతారెడ్డిని తొలిసారి నాగార్జున సాగర్ లోనే చూశారట. ఆయన స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా నది తీరం వద్దకు వచ్చారట. అప్పుడే అనుకోకుండా గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారట. అలా ఏర్పడిన ప్రేమ.. చివరికి పెద్దలను వివాహ బంధంగా మారింది. ఇది జరిగిన 34 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో రేవంత్ తన భార్యతో కలిసి తిరిగి నాగార్జున సాగర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా తమ క్యూట్ లవ్ స్టోరీని గుర్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Also Read: వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

రేవంత్ ఫ్యామిలీ, రాజకీయ ప్రస్థానం

సీఎం రేవంత్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆయన తల్లిదండ్రులు రామచంద్రమ్మ, నరసింహారెడ్డి. భార్య గీతారెడ్డిని 1992లో రేవంత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒకే ఒక్క కుమార్తె నిమిషారెడ్డి ఉన్నారు. ఇక విద్యార్థి దశ నుంచే పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న రేవంత్.. 2009లో టీడీపీ నుంచి తొలిసారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2023 ఎన్నికల్లోనూ కొండగల్ నుంచి విజయదుందుభి మోగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను గద్దె దించడంలో ముఖ్య భూమిక పోషించిన రేవంత్.. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో కొనసాగుతున్నారు.

Also Read: Airtel బంపరాఫర్.. రోజుకు రూ.12 కే 5G డేటా, రూ.4,000 విలువైన బెనిఫిట్స్.. ప్లాన్ వివరాలు ఇవే!

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×