BigTV English

Prashant Kishore : అయ్యో… రాహుల్‌ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?

Prashant Kishore : అయ్యో… రాహుల్‌ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?

Prashanth Kishore Interesting Comments On Mp Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్ సభ సభ్యులు రాహుల్‌ గాంధీ నాయకత్వంపై ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకులు అహంకారంతో ప్రవర్తిస్తే దేశ ప్రజలు సహించబోరన్నారు. నూతనంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఎన్నికల వ్యూహకర్త ఇంటర్వ్యూ ఇచ్చారు.


నాయకులు అహంకారాన్ని ప్రదర్శిస్తే దేశ ప్రజలు సహించరు. ఎన్నికల సమయంలో తప్పకుండా బుద్ధి చెబుతారు. ఏ రాజకీయ నేతను లక్ష్యంగా చేసుకుని తాను ఈ వ్యాఖ్యలు చేయట్లేదన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల ముందు వరకు కూడా మళ్లీ కాంగ్రెస్‌ పుంజుకుంటుందో లేదోనన్న అనుమానాలు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి.  కానీ, ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ, సమర్థంగా వ్యవహరిస్తారన్న నమ్మకాన్ని ఆ పార్టీ శ్రేణులు నమ్మారు.

ఈ విషయంలో మరో కోణం ఏంటంటే, ఆయనను దేశమంతా నాయకుడిగా అంగీకరించిందా లేదా అన్నది తనకు తెలియదన్నారు. కానీ తానైతే అలా అనుకోవట్లేదని చెప్పుకొచ్చారు. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పీకేను అడగ్గా, ప్రధాని మోదీ పేరు కనిపిస్తే చాలు ఓట్లు రాలతాయని బీజేపీ విశ్వసించిందన్నారు.


Also read : రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

కానీ, గతంతో పొలిస్తే ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ జోరు తగ్గినట్లు కనిపించిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు రాహుల్‌ గాంధీ కఠోరంగా శ్రమించారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ నాయకత్వంపై సొంత పార్టీలో చెలరేగిన అనుమానాలను పటాపంచలు చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్లగలరనే నమ్మకం క్యాడర్ లో స్పష్టంగా కనిపించిందన్నారు.

మరోవైపు పీకే- ప్రశాంత్‌ కిషోర్ రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వ సన్నద్ధమయ్యారు. తన కొత్త పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఇతర పేర్లు, వివరాలను అక్టోబరు 2న ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండబోదని చెప్పడం గమనార్హం.

Related News

Fire Accident: ఐసీయూలో ఒక్కసారిగా మంటలు.. ఆరుగురు రోగుల మృతి, రాజస్థాన్‌లో ఘోరం

Nepal Landslide: కొండచరియలు విరిగిపడి.. 14 మంది మృతి

Cough Syrup: షాకింగ్.. దగ్గు మందులో విషపూరిత రసాయనాలు, టెస్టుల్లో ఏం తేలిందంటే?

Cyclone Shakti: దూసుకొస్తున్న శక్తి సైక్లోన్.. తీర ప్రాంతాలకు ఐఎండీ కీలక హెచ్చరికలు!

MLA KP Mohanan: ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చొక్కాపట్టుకుని నడిరోడ్డుపై నిలదీసిన స్థానికులు, వైరల్ వీడియో

Rajnath Singh: సర్ క్రీక్ పై చేయి వేస్తే కరాచీని లేపేస్తాం – రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

Warning To Pakistan: అలా చేస్తే, మ్యాప్‌లో లేకుండా పోతారు.. పాకీలకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

Cough Syrup: దగ్గు మందు మరణాలు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

Big Stories

×