E-Paper
Advertisement

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!
Advertisement

BJP Bathukamma: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ బీజేపీలో బతుకమ్మ వేడుకలు రాజకీయ చర్చకు తెరలేపాయి. పండుగ సంబరాల వేదికగా సాగాల్సిన కార్యక్రమం కాస్తా.. పార్టీలోని అంతర్గత సమీకరణాలు, స్థానిక నాయకత్వ పోరు, భవిష్యత్తు రాజకీయ ఆధిపత్యంపై చర్చకు కేంద్రబిందువైంది. మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె, అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలకు తొలుత అనుమతి లభించి, ఆ తర్వాత నిరాకరణ ఎదురైందన్న పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వెనుక ఎవరున్నారు?

ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ముషీరాబాద్‌ రాజకీయాల్లో ఆధిపత్య పోరే దీనికి కారణమా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్‌ సర్కిల్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు విజయలక్ష్మి వర్గం ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం. తొలుత కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన అధికారులు, ఆ తర్వాత అనుమతిని నిరాకరించడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ పోలీసులు చెప్పినట్లు ప్రచారం జరగడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.

అధికారులు ఎందుకు మార్చారు?

Advertisement

ప్రత్యామ్నాయంగా గాంధీనగర్‌ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, తొలుత అనుకున్న వేదికపైనే కార్యక్రమం నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న విజయలక్ష్మి వర్గం ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. చివరకు ఇందిరాపార్క్‌ను వేదికగా చేసుకుని బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అయితే, అనుమతి విషయంలో తొలుత తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఎందుకు మార్చారు? నిజంగానే ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయా? వస్తే ఆ ఒత్తిళ్ల వెనుక ఎవరున్నారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఈ వ్యవహారంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ పేరు తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బతుకమ్మ వేడుకలకు లక్ష్మణ్‌ వర్గానికి చెందిన నాయకులు హాజరు కాకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. వేదిక మార్పు, అనుమతుల వివాదం, కార్యక్రమానికి కొందరు నేతలు దూరంగా ఉండటం వంటి పరిణామాలను కలిపి చూస్తున్న కొందరు కార్యకర్తలు.. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు సమాచారం.

Also Read: నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

రాజకీయ కోణం..

Advertisement

ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భవిష్యత్తులో బీజేపీ తరఫున పోటీ చేయాలనే ఆసక్తితో బండారు విజయలక్ష్మి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె నిర్వహించిన కార్యక్రమం చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలను కొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. స్థానికంగా రాజకీయంగా ఎదగాలనుకునే నాయకులకు పార్టీ అంతర్గత సమీకరణాలు కీలకంగా మారుతుంటాయి. ఒకవైపు విజయలక్ష్మి తన రాజకీయ ప్రస్థానాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ.. మరోవైపు ముషీరాబాద్‌లో ఇప్పటికే ఉన్న నాయకత్వ సమీకరణాలు.. ఈ రెండింటి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి..

ఇదిలా ఉండగా ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి హాజరుకావడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఒకవైపు కార్యక్రమానికి లక్ష్మణ్‌ వర్గీయులు దూరంగా ఉన్నారన్న చర్చ సాగుతుండగా, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి ఈ వేడుకలకు హాజరవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బతుకమ్మ వేడుకల నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు ముషీరాబాద్‌ బీజేపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. బతుకమ్మ వేడుకలతో మొదలైన ఈ చర్చ.. రానున్న రోజుల్లో ముషీరాబాద్‌ బీజేపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Also read: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

Tags

Related News

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

Big Stories

Advertisement
×