SHE Teams: ఖైరతాబాద్ గణపయ్య ఆశీస్సుల కోసం కిక్కిరిసిన జనం ఒకవైపు. బాలాపూర్ లడ్డూని చూడ్డానికొచ్చిన క్యూ లైన్లు ఇంకోవైపు. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జన వైబ్స్ మరోవైపు.. ఈ సందెట్లో సడేమియా అన్నట్లు కొందరు ఛీప్ ఫెలోస్ అమ్మాయిలు కనిపించగానే.. కేకలు పెట్టడం, వికృత చేష్టలకు దిగడం. బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి చిల్లరగాళ్లు అక్కడక్కడ కనిపిస్తేనే ఉంటారు. బట్.. అక్కడున్నది హైదరాబాద్ పోలీసులు. ఒక్కొక్కడిని చెడుగుడు..! చెడుగుడు ఆడుకున్నారు.
సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్..
సీపీ సజ్జనార్ వేసిన మాస్టర్ ప్లాన్‌తో.. షీటీమ్స్ క్యాజువల్ డ్రెస్సుల్లో దిగిపోయాయి. కామ్‌గా సైలెంట్‌గా నిలబడి అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవడన్న ఆకతాయి వాడి వక్రబుద్ధి చూపించినా.. లేడీస్‌ని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేసినా.. విత్ ఇన్ సెకండ్స్‌లో కాలర్ పట్టుకుని పక్కకు లాగేశారు.
అమ్మాయిల జోలికొస్తే అత్తగారింటికే!
ఫెస్టివల్ మూడ్‌లో చెలరేగిపోదామనుకున్న ఆ ఇడియట్స్ ప్లాన్ ఘోరంగా రివర్స్ అయింది. షీ టీమ్స్ వేసిన పంజాకి ఇప్పటి వరకు ఒకడు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 15వందల 30 మంది ఓవరాక్షన్ ఫెలోస్ బుక్కయ్యారు. ఈ జఫ్పాగాల్లను విచారణ పేరుతో అత్తగారింటికి ఆహ్వానించి లైఫ్‌లో మరిచిపోని మర్యాద చేశారు. ఇందులో ఫస్ట్ టైమ్ దొరికిన 724 మంది వెదవలకు కౌన్సెలింగ్ ఇచ్చి, మైండ్ సెట్ అయ్యేలా వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇక అస్సలు మారని 48 మంది స్టోన్ హార్ట్ కుర్రాళ్లను డైరెక్ట్‌గా కోర్టుమెట్లు ఎక్కించి అటు నుంచి అటే జైలు శిక్ష పడేలా చేశారు. మిగిలిన క్రిమినల్స్ జాతకాన్ని క్రైమ్ టీమ్ తోడేస్తోంది.
మహిళల జోలికొస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదు..
పండగైనా, పబ్లిక్ ఈవెంట్ అయినా సరే.. మహిళల జోలికొస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదని షీ టీమ్స్ అంటున్నాయి. ఏ మూలన ఏ కెమెరా ఉందో తెలియదు. మీ పక్కన నిలబడింది సామాన్యుడో లేక సీక్రెట్ పోలీసో తెలియదు. పొరపాటున మీరు ఏ తీటా పనిచేసినా తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి షీటీమ్స్. రేపటి నిమజ్జన టైమ్‌లోనూ ఒళ్లుదగ్గరపట్టుకొని ఉంటే సరే.. లేదంటే.. అత్తగారింటికి వెళ్లి మర్యాదలు చేసుకొని రావాల్సి ఉంటుంది. జర జాగ్రత్త కుర్రాళ్లు.
Also Read: తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరినీ వదలం.. కోర్టులో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!