Monsoon Update: దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జూన్ ఒకటో తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
జూన్ 15 నాటికి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. గత వారం ఐఎండీ జూన్ ఒకటి లేదంటే.. మే 27 న కేరళ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
రుతుపవనాలు అండమాన్ మీదుగా కేరళను తాకుతూ వర్షాలను కురిపిస్తూ ముందుకు వెలతాయని పేర్కొంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్ కొనసాగుతుంది. గతేడాది ఆలస్యంగా జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణంగా జూన్ ఒకటి కంటూ ముందే కేరళను రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Also Read: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో హైఅలర్ట్
రుతుపవనాల సీజన్ లో వర్షాపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఎల్ పీఏలో 106 శాతం వరకు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. కానీ గతేడాది ఎల్ పీఏలో 94.4 శాతం వర్షాపాతం మాత్రమే నమోదు చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు సామాచారం అందిస్తామని ఐఎండీ పేర్కొంది.