Tamil Nadu Jallikattu 2025|తమిళనాడు సంస్కృతికి ప్రఖ్యాతి గాంచిన జట్టికట్టు వేడుకలు మంగళవారం జనవరి 14, 2025న రాష్ట్రంలోని మదురైలో ప్రారంభమయ్యాయి. మదురైలోని అవనియపురం గ్రామంలో ఈ వేడుకల సందర్భంగా తొలిరోజు పోటీలకు 1100 ఎద్దులను 900 మంది యువకులు పాల్గొన్నారు. రంకెలేస్తూ పరుగులు తీసే ఈ ఎద్దులను నియంత్రించి వాటిని మచ్చిక చేసుకునే యువకులు ఈ పోటీల్లో విజేతలుగా ప్రకటిస్తారు.
అయితే ఈ సారి పోటీట్లో బెస్ట్ బుల్ టేమర్ కు రూ.11 లక్షల విలువ గల ట్రాక్టర్ మొదటి బహుమానం కావడం విశేషం. రెండో విజేతకు రూ.8 లక్షల కారు. మరిన్ని బహుమానాలు కూడా ఉన్నాయి. మదురైలో మరో రెండు చోట్ల కూడా జల్లికట్లు పోటీలు నిర్వహిస్తున్నారు. పాలమేడు, ఆళంగనల్లూర్ గ్రామాల్లో జనవరి 15, జనవరి 16న ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటీల నిర్వహణకు భద్రత కోసం కఠిన నియమ, నిబంధనలు విధించారు.
మదురై జిల్లా యంత్రాంగం విధించిన నియమాల ప్రకారం.. ప్రతి ఎద్దుని జిల్లాల్లో నిర్వహించే జల్లికట్టు కోసం నిర్వహించే మూడు పోటీల్లో ఏదో ఒక చోట మాత్రమే అనుమతిస్తారు. ఆ ఎద్దుతో పాటు దాని యజమాని, దాని ట్రైనర్ తప్పనిసరిగా ఉండాలి. ఎద్దు యజమాని, ట్రైనర్.. మదురై జిల్లా జల్లికట్టు వెబ్ సైట్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్ సైట్ అడ్రస్ “madurai.nic.in”.
Also Read: బ్రాహ్మణ దంపతులకు భారీ ఆఫర్.. నలుగరు పిల్లలు కంటే నజరానా
రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశాక.. ఆ పత్రాలు పరిశీలించి.. అవన్న సరిగా ఉంటే ఎద్దు యజమాని ఆన్ లైన్ లో ఒక టోకెన్ ఇవ్వబడుతుంది. యజమాని ఆ టోకెన్ డోన్ లోడ్ చేసుకొని జల్లికట్టు పోటీల వద్దకు తప్పని సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ టోకెన్ లేకుంటే ఎద్దు లేదా దాన్ని నియత్రించే బుట్ టేమర్స్ యువకులను లోపలికి అనుమతించరు.
మదురైలో జల్లికట్టు పోటీలు అంతర్జాతీయ ప్రామాణాలతో నిర్వహించబడుతున్నాయి. తమిళనాడు సంస్కృతి, గ్రామీణ ధీరత్వానకి జల్లికట్టు ప్రతీకగా తమిళ ప్రజలు భావిస్తారు. ఇప్పటికే జల్లికట్టు కోసం భారీగా ఏర్పట్లు జరిగాయి. గత శనివారం థాచన్‌కురిచి గ్రామంలో పురుకొట్టై జిల్లాలో మొదటి జల్లికట్టు పోటీలు నిర్వహించారు.
పుదుకొట్టై జిల్లాలో జల్లికట్టు పోటీల కోసం అత్యధిక సంఖ్యలో ఎద్దులు పాల్గొనేందుకు ఏర్పాట్లు ఉన్నారు. అత్యధిక జల్లికట్టు పోటీలు కూడా పుదుకొట్టై లోనే జరగడం గమనార్హం. జనవరి సంక్రాంతి సమయంలో ప్రారంభమయ్యే ఈ పోటీలు మే 31 వరకు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. మొత్తం 120 జల్లికట్టు పోటీల్లో ఎద్దు నియంత్రణ పోటీతో పాటు 30 చోట్ల ఎద్దుల బండి పరుగుల పోటీలు కూడా పుదుకొట్టైలో నిర్వహిస్తారు.
జల్లికట్టు పోటీలు తమిళనాడులో పురాతన కాలం నుంచి జరుగుతున్నాయి. క్రీస్తు పూర్వం 400-100 BCE కాలం నుంచి పోటీల అస్తిత్వం ఉన్నట్లు ఆధారాలున్నాయి. జల్లికట్టు అనే పేరు రెండు తమిళ పదాలు.. జల్లి (బంగారం, సిల్వర్) , కట్టు (కట్టేసి) కలియికతో వచ్చింది. ఈ వేడుకలో రంకెలేస్తూ పరుగెత్తుతున్న ఎద్దు వీపుని ఒక యువకుడు గట్టిగా పట్టుకొని దాన్ని మచ్చిక చేసుకుంటూ ఆపేందుకు ప్రయత్నిస్తాడు.