Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, కొందరు డాక్టర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొంది. టాటా గ్రూప్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామని అన్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన అహ్మదాబాద్ లోని బీజీ మెడికల్ కాలేజీ భవనాన్ని మళ్లీ నూతనంగా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తనను కలిచివేసిందని చెప్పారు. తమ ఎయిర్ ఇండియా విమానం 171 అహ్మాదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైనట్టు ఆయన చెప్పారు. ఈ ప్రమాదం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన ప్రయాణికులు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలకు చేస్తున్నామని అన్నారు. తమ కస్టమర్ కేర్ టీమ్ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని తెలిపారు. మిగిలిన విషయాలన్నీ తమకు తెలిసిన వెంటనే పంచుకుంటామని చంద్రశేఖర్ తెలిపారు.
ALSO READ: Ahmedabad Plane Crash : మిరాకిల్.. విమాన ప్రమాదంలో బతికిన ఒకేఒక్కడు.. వీడియో వైరల్
కాగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాద పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఓ చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 242 ఉన్నారు. ఇందులో ఇద్దరు పైలట్లు, పది మంది సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్కరు మినహాయించి.. మిగిలిన 241 మంది స్పాట్ లోనే మృతిచెందారు. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు. అలాంగే మెడికల్ కాలేజీ భవనంలో 20 మందికి పైగా డాక్టర్లు కూడా మృతిచెందినట్టు తెలుస్తోంది.
ALSO READ: Plane Crashes in India: మన దేశంలో అత్యంత డేంజర్ విమాన ప్రమాదాలివే.. వామ్మో ఇన్ని జరిగాయా!