E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 23rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మలోని అరుంధతి   

Nindu Noorella Saavasam Serial Today Episode September 23rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మలోని అరుంధతి   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆత్మను బంధించేందుకు బయటకు వెళ్లిన చంభా తన మంత్ర శక్తితో ఒక కుక్కను పుట్టించి దానితో కలిసి వెల్లి ఆరు ఆత్మను బంధించాలి అనుకుంటుంది. మనోహరి కూడా తాను అనుకున్నట్టే అమర్,  పార్థులను నమ్మించి  మిస్సమ్మను బయటకు తీసుకెళ్తుంది. ఇద్దరిని రాథోడ్‌ కారులో ఆశ్రమానికి తీసుకెళ్తుంటాడు. మరోవైపు అన్ని శక్తులు కూడగట్టుకుని ఆరు ఆత్మను బంధించేందుకు చంభా కుక్కతో కలిసి వాళ్ల కారుకు ఎదురుగా వెళ్తుంది. రోడ్డు మీద ఒక దగ్గర కొన్ని ఇనుప ముక్కలు వేస్తుంది చంభా.

ఇంట్లో కూర్చుని తన మీద ఫారెస్ట్‌ లో అటాక్‌ చేసిన రౌడీల గురించి ఆలోచిస్తుంటాడు పార్థు. ముగ్గురిలో ఒకడు పోలీసులకు దొరికాడు. మరో ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు. అంటే టైం చూసుకుని కచ్చితంగా మళ్లీ అటాక్‌ చేస్తారు. పెళ్లి టైంలో అటాక్‌ చేయోచ్చు.. కాబట్టి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఎలా పని చేస్తున్నాయో చూడాలి అనుకుంటాడు. వెంటనే తన లాప్‌ టాప్‌ ఓపెన్‌ చేసి సీసీ కెమెరాలను పరిశీలిస్తాడు. అప్పుడే ఆ సీసీటీవీ ఫుటేజీలో పార్థుకు ఒక ఆసక్తికరమైన వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో చూసి షాక్‌ అవుతాడు. ఆ వీడియో మిస్సమ్మ బయట నిలబడి ఒక్కతే మాట్లాడటం గమనిస్తాడు పార్తు.

Advertisement

పార్థు ఆశ్చర్యంగా అమర్‌ను పిలుస్తాడు. అమర్‌కు ఆ వీడియో చూపిస్తాడు. భాగీ గారికి ఏమైంది అమర్‌.. తనలో తానే మాట్లాడుకుంటుంది అని అడుగుతుంటే.. అమర్‌ మాత్రం గతం గుర్తు చేసుకుంటాడు. మిస్సమ్మ ఆరుతో మాట్లాడిన విషయాలు ఆరును పక్కింటి ఆవిడ అనుకుని మాట్లాడిన విషయాలు అన్ని గుర్తు చేసుకుంటాడు. పార్థు ఏంటి అమర్‌ ఏం చెప్పవేంటి అని అడిగితే.. అమర్‌ తాను చెప్పే విషయం వింటే నువ్వు షాక్‌ అవుతావు.. బహుశా నమ్మవేమో అంటాడు అమర్‌. ఏంటా విషయం అమర్‌.. అని పార్థు అడిగితే..

ఇంతకుముందు భాగీ, ఆరు ఆత్మతో మాట్లాడేది. భాగీకి ఆరు కనిపించేది.. అయితే ఆరును అంతకుముందు ఎప్పుడూ చూడని భాగీ పక్కింటావిడ అనుకుని మాట్లాడేదని చెప్పింది. ఒక స్వామిజీ చెప్పే వరకు మాకు తెలియదు. ఆరు ఆస్తికలు ఇంట్లోనే ఉండటం వల్ల అలా జరిగేదని ఆస్థికలు నిమజ్జనం చేస్తే ఆరు ఆత్మ వెళ్లిపోతుందని చెబితే ఆస్థికలు నిమజ్జనం చేశాము. తర్వాత ఆరు బుజ్జమ్మగా పుట్టింది అనుకున్నాము.. మళ్లీ ఇన్నాళ్లకు భాగీ ఆరుతో మాట్లాడటం చూశాము అంటే ఆరు ఆత్మ మళ్లీ వచ్చింది. నేను వెంటనే భాగీ దగ్గరకు వెళ్లాలి అంటూ అమర్‌ వెళ్లబోతుంటే.. పార్థు తాను వస్తానంటాడు. అమర్‌ వద్దని ఇంట్లో పిల్లలు ఉన్నారని పార్థును ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్లిపోతాడు.

Advertisement

బయటకు వెళ్లిన అమర్‌ వెంటనే రాథోడ్‌కు కాల్ చేస్తాడు. రాథోడ్ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడితే అమర్‌, మిస్సమ్మ గురించి అడుగుతాడు. అప్పుడే సిగ్నల్‌ ప్రాబ్లం అయి రాథోడ్‌ కాల్‌ కట్‌ అవుతుంది. వెంటనే అమర్‌ కారు స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోతాడు. ఇక కారులో వెళ్తున్న మనోహరి ఆందోళనగా బయటకు చూస్తుంది. ఈ చంభా ఎక్కడకు వెళ్లింది ఇంకా రావడం లేదు అనుకుంటూ చూస్తుంటే.. మిస్సమ్మలో ఉన్న ఆరు కోపంగా చూస్తూ.. ఏంటి మనోహరి ఎందుకు బయటకు చూస్తున్నావు.. అని అడిగితే.. ఊరికే సరదాగా చూస్తున్నాను అని మనోహరి చెప్తుంది. మిస్సమ్మ వెటకారంగా రాథోడ్‌ మనోహరి సరదాగా బయటకు చూస్తుందట.. నువ్వు మాత్రం బయటకు చూడకు లేదంటే యాక్సిడెంట్‌ అవుతుంది అంటుంది. ఆ మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన చక్రీ.. అడ్డంగా బుక్కయిన మాధవ్.. మహా దెబ్బకు మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో షాక్.. శ్రీవల్లికి మరో దెబ్బ.. సుకన్య ప్లాన్ సక్సెస్..

Ninnu kori Serial Today Episode September 23rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను చీట్ చేసి ఆస్థి కొట్టేయాలనుకున్న జీవన్ 

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవి దొరికిపోతుందా..?

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

ముఖేష్ ఇంత స్వార్థపరుడా.. పాపం ఏడ్చేసిన దేబ్జానీ!

బిగ్ బాస్ 10 పై నటుడు ప్రభాకర్ కామెంట్స్..ఆ కంటెస్టెంట్ కు ఫుల్ సపోర్ట్!

Big Stories

Advertisement
×