Big Stories

Woman gives Birth to 5 Babies: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?

Woman in Bihar gives Birth to 5 Babies : ఓ గర్భిణీకి పురిటినొప్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని ఆసుపత్రి వైద్యులు పరీక్షించి సురక్షితంగా ప్రసవం చేశారు. అయితే, ఆమె ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తల్లీ ఐదుగురు శిశువులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆమెకు ఇది వరకే ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది.

- Advertisement -

బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా ఠాకూర్ గంజ్ ప్రాంతానికి చెందినటువంటి ఓ గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఠాకూర్ గంజ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని వైద్యులు పరీక్షించారు. అనంతరం సురక్షితంగా ప్రసవం చేశారు. అయితే, ఆమె ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు ఆడశిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ ఐదుగురు శిశువులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

- Advertisement -

అయితే, ఆమెకు ఇదివరకే ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆమె సంతానం ఆరుగురు. అయితే ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఒకే సమయంలో ఫలదీకరణం చెందడవం వల్ల ఇలా ఒకే కాన్పులో ఎక్కువమంది శిశువులకు జన్మనిస్తారని వారు తెలిపారు. అయితే, ఆమెకు ప్రసవం చేయడం తమకు సవాల్ గా మారిందని వారు తెలిపారు. అదేవిధంగా జన్యుపరమైనటువంటి కారణాల వల్ల కూడా ఇలా ఒకే కాన్పులో ఎక్కువమంది శిశువులు జన్మిస్తుంటారని తెలిపారు. కాగా, ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం స్థానికంగా చర్చనీయాంశమయ్యిందని.. ఈ విషయం తెలిసి స్థానికులు ఆసుపత్రికి చేరుకుని నవజాత శిశువులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

కాగా, కొన్నాళ్ల క్రితం జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ఓ మహిళ కూడా ఇలాగే ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చింది. అది కూడా గర్భం దాల్చిన ఏడు నెలలకే ఆమె ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. దీంతో అప్పుడు స్థానికంగా భారీగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News