BigTV English

OTT Movie : 35 మంది పిల్లలు మిస్సింగ్… పోలీసులకు హింట్ ఇస్తూ కిడ్నాపులు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సైకో థ్రిల్లర్

OTT Movie : 35 మంది పిల్లలు మిస్సింగ్… పోలీసులకు హింట్ ఇస్తూ కిడ్నాపులు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సైకో థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ గురించి వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. అయితే ఇది మూవీ కాదు వెబ్ సిరీస్. క్షణం క్షణం ఉత్కంఠభరితమైన ట్విస్టులు, థ్రిల్లింగ్ సర్ప్రైజ్ లతో ఈ సిరీస్ వర్త్ వాచింగ్ అన్పిస్తుంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అభయ్ సీజన్ 2’. ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అభయ్ ప్రతాప్ సింగ్ (కునాల్ కేము) చుట్టూ తిరిగే కథ. ఈ సీజన్ ఒక రహస్యమైన క్రిమినల్ మాస్టర్‌మైండ్‌ ను పట్టుకోవటానికి అభయ్‌ చేసే ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, యాక్షన్, డార్క్ సైకలాజికల్ డ్రామాతో నిండిన ఒక ఉత్కంఠభరితమైన స్టోరీ. లక్నోలో జరిగే విచిత్రమైన నేరాలు, సీరియల్ కిల్లర్‌లు, 35 మంది పిల్లల ప్రాణాలు పణంగా ఉండడం వంటి ఛాలెంజెస్ ఈ సిరీస్… ప్రేక్షకులకు ఒక డీప్, ఎమోషనల్, థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

“అభయ్ సీజన్ 2” అనే ఈ వెబ్ సిరీస్ ZEE5 ఒరిజినల్‌గా రిలీజ్ అయ్యింది. దీని తెలుగు డబ్బింగ్‌ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని కెన్ ఘోష్ డైరెక్ట్ చేశారు. కునాల్ కేము అభయ్ ప్రతాప్ సింగ్‌గా నటించారు. రామ్ కపూర్ క్రిమినల్ మాస్టర్‌ మైండ్‌గా, చంకీ పాండే ‘బ్రెయిన్ సూప్ కిల్లర్’గా నటించారు. ఇతర ముఖ్య నటీనటుల్లో ఆశా నేగి (సోనమ్), నిధి సింగ్ (ఖుష్బూ), బిడితా బాగ్, రాఘవ్ జుయాల్ (సమర్), ఇంద్రనీల్ సేన్‌గుప్తా, అశీమా వర్ధన్, ఎల్నాజ్ నౌరోజీ (నటాషా), నమిత్ దాస్ తదితరులు కన్పిస్తారు.


కథలోకి వెళ్తే…
ఈ సిరీస్ రెండు మూడు సీజన్లుగా రిలీజ్ అయ్యింది. “అభయ్ సీజన్ 2” కథ మొదటి సీజన్ సంఘటనలు జరిగిన ఏడాది తర్వాత జరుగుతుంది. అభయ్ ప్రతాప్ సింగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్. లక్నోలో జరుగుతున్న విచిత్రమైన నేరాలను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇందులో విద్యార్థుల మిస్సింగ్ కేసులు ప్రధానమైనవి. ఈ కేసుల వెనుక ఒక తెలివైన క్రిమినల్ మాస్టర్‌మైండ్ ఉంటాడు.

అతను అభయ్‌ను ఒక డేంజరస్ గేమ్‌లోకి ఆహ్వానిస్తాడు. ఈ క్రిమినల్ అభయ్‌కు ఒక సవాల్ విసురుతాడు: ఒక్కో కేసును పరిష్కరిస్తే, బందీగా ఉన్న 35 మంది పిల్లలలో ఇద్దరిని విడుదల చేస్తానని, కానీ ఒక్క చిన్న తప్పు జరిగినా ఒక పిల్లవాడు చనిపోతాడని హెచ్చరిస్తాడు. ఈ ఒత్తిడితో అభయ్ తన బృందంతో కలిసి, తీవ్రమైన నేరస్థులను ఎదుర్కొంటూ, పిల్లలను కాపాడేందుకు రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడతాడు.

Read Also : భర్త ఉండగానే పోలీస్ ఆఫీసర్ తో… ఒక్క మిస్సింగ్ కేసుతో నాలుగు ఫ్యామిలీల సీక్రెట్స్ బట్టబయలు

ఈ సీజన్‌లో అభయ్ వివిధ రకాల నేరాలను ఛేదిస్తాడు. వాటిలో ‘బ్రెయిన్ సూప్ కిల్లర్’ది ఒక విచిత్రమైన, క్రూరమైన కేసు. మరో కేసులో (ఇంద్రనీల్ సేన్‌గుప్తా పాత్ర) 12 గంటల్లో ఒక కిల్లర్‌ను పట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి కేసు అభయ్‌కు కొత్త ఛాలెంజ్ ను తీసుకొస్తుంది. అభయ్ తన వ్యక్తిగత జీవితంలోని బాధలు భార్య మరణం, కొడుకు సాహిల్‌ రక్షణ వంటి విషయాలతో పోరాడుతూనే, కేసులను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. చివరికి హీరో ఆ కిల్లర్ ను పట్టుకోగలిగాడా? కిల్లర్ హీరోతో ఎందుకు ఇలా గేమ్స్ ఆడుతున్నాడు? ఆ 35 మంది పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారా? అనేది ఓటీటీలో చూడాల్సిందే.

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×