Kiwi Side Effects: కివీ ఫ్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పండు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. చర్మ ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా మేలు చేస్తుంది. అంతే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. కానీ కివీ ఫ్రూట్ కొంతమంది తినకుండా ఉంటే మంచిది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అలెర్జీ సమస్య ఉన్న వ్యక్తులు:
కొంతమందికి కివీ అంటే అలెర్జీ ఉండవచ్చు. కివీ తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కూడా వస్తుంటాయి. అలెర్జీ లక్షణాలను కలిగి ఉన్నవ వారు కూడా కివీ ఫూట్ తినకుండా ఉంటేనే మంచిది.
జీర్ణ సమస్యలు:
కివీ ఫ్రూట్‌లో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ కొంతమందికి ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. మీకు ఇప్పటికే ఆమ్లత్వం, గ్యాస్ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు ఉంటే.. కివీ పండ్లను పరిమిత పరిమాణంలో తినండి. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు కివీ ఫ్రూట్ తినకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్న వ్యక్తులు:
కివీ పండులో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. కానీ రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు లేదా రక్తం పలుచబరిచే మందులు వాడేవారు కివీ పండు తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ K అధికంగా ఉండటం వల్ల ఈ మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ఈ పరిస్థితిలో.. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే కివీ పండు తినండి.
కిడ్నీ సమస్యలు:
కివీ ఫ్రూట్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హానికరం. మీకు మూత్రపిండాల వ్యాధి ఉంటే.. పరిమిత పరిమాణంలో కివీ ఫ్రూట్ తినండి. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారు కివీ తింటే సమస్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
Also Read: టాప్ సీక్రెట్.. జుట్టు పెరగడానికి ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు
గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు:
కివీఫ్రూట్‌లోని పోషకాలు గర్భిణీ, పాలిచ్చే స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తినకూడదు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే.. డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
కివీ తినడానికి చిట్కాలు:
-కివీ తినడానికి ముందు ఎల్లప్పుడూ కడిగి తొక్క తీయండి.
-మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. పరిమిత పరిమాణంలో కివీ తినండి.
-కివీతో పాటు ఇతర పండ్లను చేర్చడం ద్వారా సమ తుల్య ఆహారం తీసుకోండి.
-కివీ తిన్న తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.