E-Paper
Advertisement

విలన్ ను అల్లాడించే ఆల్ఫా అమ్మాయిలు… ఓటీటీలోకి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్

విలన్ ను అల్లాడించే ఆల్ఫా అమ్మాయిలు… ఓటీటీలోకి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Alpha OTT : స్పై మిషన్ అంటేనే ప్రాణాలకు తెగించి శత్రువుల గుట్టు రట్టు చేయడం. మరి అలాంటి మిషన్‌లో ఇద్దరు ఫీమేల్ ఏజెంట్లు రంగంలోకి దిగితే? ఎదురుగా ఎంత పవర్‌ఫుల్ విలన్ ఉన్నా వెనక్కి తగ్గకుండా అతని సామ్రాజ్యాన్నే కూల్చే మిషన్ మొదలుపెడితే? అలియా భట్, శర్వరీ కలిసి నటించిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఫీమేల్ లీడ్స్‌తో వచ్చిన ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మరి ‘ఆల్ఫా’ ఏ మిషన్ కోసం రంగంలోకి దిగింది ? విలన్‌తో వీళ్ల పోరాటం ఎలా సాగుతుంది? అనే వివరాల్లోకి వెళ్దాం.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో అలియా భట్, శర్వరీ ఇద్దరూ దేశం కోసం ప్రాణాలకు తెగించి పని చేసే స్పై ఏజెంట్లుగా కనిపిస్తారు. ఇద్దరి వ్యక్తిత్వాలు, పని చేసే విధానం వేర్వేరుగా ఉన్నప్పటికీ… దేశ భద్రత విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతారు. సాధారణ మిషన్‌లకు భిన్నంగా ఈసారి వీళ్ల ముందున్న టార్గెట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన ఓ శక్తివంతమైన శత్రువును అడ్డుకునేందుకు వీరిద్దరికీ కీలకమైన బాధ్యత అప్పగిస్తారు. మొదట్లో ఇది ఒక సాధారణ స్పై ఆపరేషన్‌ లాగే కనిపించినా… మిషన్ ముందుకు వెళ్లే కొద్దీ అసలు ప్రమాదం ఏంటో వారికి అర్థమవుతుంది.

Advertisement

ఏజెంట్లనే టార్గెట్ చేస్తున్న వ్యక్తి కేవలం ఓ క్రిమినల్ కాదని, దేశాలను సైతం ప్రభావితం చేయగల భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్న ప్రమాదకరమైన వ్యక్తి అని తెలుస్తుంది. విలన్ తన లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత తెలివైన ప్లాన్స్ వేస్తుంటాడు. అతని ప్రతి అడుగును ముందే ఊహించి అడ్డుకోవడం ఆల్ఫా ఏజెంట్లకు పెద్ద సవాల్‌ గా మారుతుంది. ఒకవైపు శత్రువుల నుంచి ప్రమాదం ఎదురవుతుంటే… మరోవైపు మిషన్‌లో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే అనుమానాలు ఆందోళనలో పడేస్తాయి. ఈ క్రమంలో అలియా, శర్వరీ మధ్య ఉన్న నమ్మకం కూడా కీలకంగా మారుతుంది. ఒకరి ప్రాణాలను మరొకరు కాపాడుకుంటూ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తారు. గన్ ఫైట్స్, ఛేజింగ్ సీన్స్ తో కథ వేగంగా సాగుతుంది.

అయితే ఇది కేవలం యాక్షన్ కథ మాత్రమే కాదు… దేశం కోసం వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టాల్సి వచ్చే పరిస్థితులను కూడా చూపిస్తుంది. మరి ఈ భారీ కుట్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఆల్ఫా ఏజెంట్లనే విలన్ ఎందుకు టార్గెట్ చేశాడు? అతని నెట్‌వర్క్‌ను వీళ్లు ఎలా ఛేదించారు? మిషన్‌లో దాగి ఉన్న ద్రోహి ఎవరు? చివర్లో బాబీ డియోల్ పాత్ర ఎలాంటి షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను పూర్తిగా చూడాల్సిందే.

Advertisement

Also Read : పెళ్లయినా తీరని కోరికలు… ఓటీటీలోకి బోల్డ్ ఇంటెన్స్ విమెన్ సెంట్రిక్ ఆంథాలజీ సిరీస్

తెలుగులో అందుబాటులో ఉందా?

శివ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’లో అలియా భట్, శర్వరీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఇది ఏడో చిత్రం కాగా, ఈ ఫ్రాంచైజ్‌లో ఫీమేల్ లీడ్స్‌తో వచ్చిన తొలి మూవీగా నిలిచింది. 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆగస్టు 28 నుంచి Netflix (నెట్‌ఫ్లిక్స్)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు ఆడియో మాత్రం అందుబాటులో లేదు. ఫీమేల్ స్పై ఏజెంట్లు, భారీ యాక్షన్, దేశాన్ని కాపాడే మిషన్, పవర్‌ఫుల్ విలన్‌తో ఢీకొనే యాక్షన్ సీన్స్ తో సినిమా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటుంది.

Tags

Related News

ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన లోకేష్ కనగరాజ్ డీ.సీ.మూవీ.. ఎప్పుడంటే?

పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్

ప్రేమ కోసం అలాంటి పని… ఇంట్లో పెద్ద గందరగోళంతో ఫుల్ ఫన్… మస్ట్ వాచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

ఫోన్ కూడా ఫింగర్‌ప్రింట్ గుర్తుపట్టకపోతే… ఇంట్లోనే పరాయివాడైపోయిన రచయిత… క్రేజీ ట్విస్టులున్న కొరియన్ సిరీస్

జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ

ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే

సీమంతంకు వెళ్తే సస్పెండ్… ఈ లేడీ సింగం గట్స్ కు దండం పెట్టాలి మావా… తెలుగులోనూ హిందీ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×