E-Paper
Advertisement

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి
Advertisement

Crime Thriller OTT : ఓ తండ్రికి తన కొడుకు కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది ? అతడిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతాడు. కానీ ఆ తండ్రి ఓ నగరానికి మేయర్ కావాలని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న వ్యక్తి అయితే… కొడుకు కిడ్నాప్ వ్యవహారం బయటకు రావడం అతడి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేస్తే… వ్యక్తిగత జీవితం, రాజకీయ ఆశలు రెండూ ఒకేసారి కుప్పకూలే పరిస్థితి ఎదురైతే అతడు ఏం చేస్తాడు ? ఈ ప్రశ్నల చుట్టూ తిరిగే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘Animals’. మరి ఈ సినిమా కథలో అసలు మలుపులేంటో చూద్దాం.

కథలోకి వెళ్తే…

లాస్ ఏంజెల్స్‌లో మేయర్ పదవి కోసం పోటీ పడుతున్న మార్క్ కింబాల్‌కు రాజకీయంగా కీలకమైన సమయం అది. ఎన్నికల ప్రచారం, ప్రజల మద్దతు, తన ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం వంటి విషయాలపై అతడు దృష్టి పెట్టి ఉంటాడు. అతడి భార్య అబిగెయిల్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుంది. ఓ అనూహ్యమైన ఘటన ఆ కుటుంబాన్ని టెన్షన్ లో పడేస్తుంది. మార్క్ కొడుకు కిడ్నాప్‌కు గురవుతాడు. తమ బిడ్డను సురక్షితంగా తిరిగి తీసుకురావాలంటే ఏం చేయాలనే ఆందోళన మొదలవుతుంది.

Advertisement

కిడ్నాపర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. కొడుకును కాపాడుకోవడానికి కావాల్సిన డబ్బును త్వరగా సమకూర్చాలి. అదే సమయంలో ఈ వ్యవహారం బయటకు వస్తే మార్క్ ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా ఆలోచించాల్సి వస్తుంది. కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆత్రం ఒకవైపు ఉంటే, రాజకీయంగా సాధించిన స్థానాన్ని కోల్పోకూడదనే ఒత్తిడి మరోవైపు ఉంటుంది. డబ్బు సమకూర్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కుటుంబం ఎదుర్కొనే సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.

ఈ కథలో కిడ్నాప్ వెనుక ఉన్న వివరాలు, ఆ కుటుంబం చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి రహస్యాలు, బయటకు కనిపించే జీవితానికి, లోపల జరిగే విషయాలకు మధ్య తేడాలు కథలో కీలకంగా మారతాయి. నిజం బయటపడే కొద్దీ మార్క్, అబిగెయిల్ తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలనే కాదు, కుటుంబ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి. కిడ్నాపర్లకు డబ్బు చెల్లిస్తే కొడుకు తిరిగి వస్తాడా ? డబ్బు సమకూర్చే ప్రయత్నంలో మార్క్ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టాల్సి వస్తుందా ? ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజం బయటపడినప్పుడు కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే అంశాలతో ‘Animals’ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Advertisement

Also Read : పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

తెలుగులో ఉందా ?

‘యానిమల్స్’ చిత్రానికి బెన్ అఫ్లెక్ దర్శకత్వం వహించడమే కాకుండా, మార్క్ కింబాల్ పాత్రలోనూ నటించారు. కెర్రీ వాషింగ్టన్ అబిగెయిల్‌గా కనిపించగా, స్టీవెన్ యూన్, గిలియన్ ఆండర్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 9న Netflixలో విడుదలైంది. ఈ ఇంగ్షీషు మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Tags

Related News

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

వైష్ణవి చైతన్య – ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ఓటీటీలోకి… తెలుగుతో సహా 5 భాషల్లో

క్రిమినల్స్ వేటలో శవమై తేలే ఏజెంట్… అనుకున్నంత సింపుల్ కాదు ఈ కేసు… ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

Big Stories

Advertisement
×