E-Paper
Advertisement

మీ పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారా.. భయపడకుండా ఇలా చేయండి?

మీ పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారా.. భయపడకుండా ఇలా చేయండి?
Advertisement

Drug Crisis: స్వేచ్చ బ్యూరో: సార్​..నా బిడ్డ డ్రగ్స్​ కు అలవాటు పడ్డాడు..అతన్ని తీసుకెళ్లి ఆ వ్యసనం నుంచి బయటపడేయండి..ఓ తల్లి ఈగల్​ ఫోర్స్​ అధికారులకు చేసిన అభ్యర్థన ఇది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ మహిళ కొడుకుతోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మైనర్లు ఉండటం గమనార్హం. ఇక, వీరికి డ్రగ్స్​ అమ్ముతున్న పెడ్లర్​ ను అరెస్ట్​ చేశారు. అదుపులోకి తీసుకున్న వారికి డ్రగ్స్​ నిర్ధారణ పరీక్షలు జరిపించగా మాదక ద్రవ్యాలు వాడుతున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతో అందరినీ డీ అడిక్షన్​ సెంటర్లకు తరలించారు.

అరెస్టులు చేస్తున్నా..

అరెస్టులు చేసి ఆస్తులను జప్తు చేస్తున్నా పదుల సంఖ్యలో పెడ్లర్లు ఒడిశా రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని ఏజన్సీ ప్రాంతాల నుంచి గంజాయి, హాష్​ ఆయిల్​ తదితర మాదక ద్రవ్యాలను తెప్పిస్తూ హైదరాబాద్​ లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మరికొందరు పెడ్లర్లు బెంగళూరు, గోవా, ముంబయిల నుంచి ఎండీఎంఏ, హెరాయిన్​, కొకైన్​ వంటి సింథటిక్​ డ్రగ్స్​ ను తెప్పిస్తూ ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెడుతున్న ఈగల్​ ఫోర్స్, లా అండ్​ ఆర్డర్​ పోలీసులు, ఎక్సయిజ్​ శాఖ సిబ్బంది పదుల సంఖ్యలో పెడ్లర్లను అరెస్ట్​ చేస్తున్నారు. గంజాయి, డైజోఫామ్​ వంటి డ్రగ్స్​ దందా చేస్తున్న కొందరు నిందితులకు సంబంధించిన కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు కూడా చేస్తున్నారు. అయినా, కొత్తగా పుట్టుకొస్తున్న పెడ్లర్లు డ్రగ్స్​ దందా చేస్తూనే ఉన్నారు. వేలమందిని క్రమంగా మృత్యువు వైపు నెడుతున్నారు.

గ‘మ్మత్తు’ కోసం..

Advertisement

ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే మైనర్లు కూడా డ్రగ్స్ కు బానిసలుగా మారుతుండటం. చెడు స్నేహాలతో గ‘మ్మత్తు’ కోసం మాదక ద్రవ్యాలను సేవిస్తుండటం. అధికారవర్గాల ద్వారా తెలిసిన ప్రకారం డ్రగ్స్​ వినియోగిస్తున్న వారిలో దాదాపు 3‌‌‌‌‌‌0శాతం మంది మైనర్లు ఉంటున్నారు. మత్తుకు అలవాటు పడుతున్న వీరిలో కొందరు డ్రగ్స్ కొనటానికి కావాల్సిన డబ్బు తమ తమ ఇళ్లల్లోనే చోరీలు చేస్తున్నారు. మరికొందరు నేరాల బాట పడుతున్నారు. కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నారు.

Also read: మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !

సమాచారం ఇవ్వండి..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈగల్​ ఫోర్స్​ అధికారులు డ్రగ్స్ అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతుండటంతోపాటు ఎవరైనా మాదక ద్రవ్యాలకు మరిగితే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. వివరాలు తెలియచేస్తే మత్తు ఊబిలో కూరుకుపోయిన వారిని దాని నుంచి బయట పడేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న భరోసానిచ్చారు.

రెండు రోజుల క్రితం..

ఈ భరోసాతో రెండు రోజుల క్రితం 19‌‌08 నెంబర్​ పై ఈగల్​ ఫోర్స్​ అధికారులకు ఫోన్ చేసిన ఓ మహిళ తన కుమారుడు డ్రగ్స్​ కు అలవాటు పడినట్టు తెలిపింది. అతనితో మాదక ద్రవ్యాలు మానిపించాలని కోరింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈగల్​ ఫోర్స్ అధికారులు ఆ మహిళ కుమారునితోపాటు అతనితో స్నేహం ఉన్న మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మైనర్లే ఉండటం గమనార్హం. డ్రగ్​స్ నిర్ధారణ పరీక్షలు జరిపించగా వీళ్లంతా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్టుగా తేలింది. దాంతో అందరినీ డీ అడిక్షన్​ సెంటర్లకు తరలించారు. ఇక, వీరికి డ్రగ్స్​ అమ్ముతున్న పెడ్లర్​ సీతాఫల్​ మండీ ప్రాంతంలో ఉంటూ ఫతేనగర్​ లో ఉల్లిగడ్డలు, పువ్వుల వ్యాపారం చేస్తున్న తుషార్​ (21)ను అరెస్ట్​ చేశారు. వనపర్తి నుంచి మరో మహిళ ఫోన్​ చేసి మైనర్​ అయిన తన కొడుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని..అతనికి చికిత్స ఇప్పించాలని కోరింది. వెంటనే మైనర్​ ను అదుపులోకి తీసుకున్న అధికారులు పరీక్షలు జరుపగా అతను డ్రగ్స్​ తీసుకోవటం లేదని నిర్ధారణ అయ్యింది. దాంతో మాదక ద్రవ్యాలను సేవించటం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను మైనర్​ కు వివరించి పంపించి వేశారు.

Also read: ఇలాంటి ఫీచర్లు ఈ ధరలో సాధ్యమేనా? Oppo K14 Plus ఫీచర్లపై ఓ లుక్కేయండి!

ఎక్కువగా..

ఇటీవలిగా మా పిల్లలు డ్రగ్స్​ కు అలవాటు పడ్డారు..వారిని మత్తు నుంచి బయట పడేయండి అంటూ ఫోన్లు చేస్తున్న తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఈగల్​ ఫోర్స్​ డైరెక్టర్​ సందీప్​ శాండిల్య తెలిపారు. ఎక్కువగా 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై ఫిర్యాదులు వస్తున్నట్టు చెప్పారు. ఫిర్యాదులు ఎక్కువగా రావటం ఈగల్​ ఫోర్స్​ అమలు చేస్తున్న చర్యల ఫలితమని తెలిపారు. తమ పిల్లలు డ్రగ్స్​ కు అలవాటు పడితే వెంటనే ఈగల్​ ఫోర్స్​ ను సంప్రదించాలని సూచించారు. ఎంతోమందిని క్రమంగా చావుకు దగ్గర చేస్తున్న మాదక ద్రవ్యాలకు పూర్తిస్థాయిలో చెక్​ పెట్టటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డ్రగ్స్​ కు అలవాటు పడ్డవారికి మాదక ద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్​ 64ఏ ప్రకారం డీ అడిక్షన్​ సెంటర్లలో చికిత్స..కౌన్సిలింగ్​ ఇప్పించి వారిని మత్తు నుంచి బయటకు తీసుకు వస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు కూడా జరిపిస్తున్నట్టు వివరించారు. డ్రగ్​ ఫ్రీ స్టేట్​ గా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపు…కేంద్రం ప్రకటించిన నషా ముక్త్​ భారత్​ అభియాన్​ లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్ట తెలిపారు.

పటిష్ట నిఘా..

డ్రగ్స్​ దందాను నిర్మూలించేందుకు పబ్బులు, ఈ సిగరెట్లు అమ్ముతున్న షాపులు, హుక్కా సెంటర్లు, మైనర్లకు మద్యం అమ్ముతున్న వైన్​ షాపులు, బార్లపై పటిష్ట నిఘా పెట్టినట్టు సందీప్​ శాండిల్య తెలిపారు. విద్యాసంస్థల వద్ద 5వందల మీటర్ల పరిధిలో ఇలాంటి మత్తు దందా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నరు. ఎవరైనా ఈ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు అమ్మితే వారిపై జువెనైల్ జస్టిస్​ యాక్ట్​ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. డ్రగ్స్​ దందా..వినియోగం గురించి తెలిస్తే వెంటనే 19‌‌08 నెంబర్​ పై ఈగల్ ఫోర్స్​ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాంతోపాటు https://eagleforce.tspolice.gov.in/ అన్న వెబ్​ సైట్​ కు వివరాలు ఇవ్వొచ్చన్నారు. 87126 71111 నెంబర్​ కు వాట్సాప్​ చేసినా..Email: tsnabho-hyd@tspolice.gov.in కు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

Tags

Related News

ఎస్‌ఆర్ నగర్ శిరీష మర్డర్ కేసులో బిగ్ ట్విస్.. నిందితుడి బిజినెస్ చూసి షాకైన పోలీసులు!

లండన్‌కు మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జ్ ఎవరు?

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్

తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్

Big Stories

Advertisement
×