Sonal Chauhan On Sanju Samson: 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న తరుణంలో టీమిండియాపై బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ ( Sonal Chauhan ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో సంజు శాంసన్ ను పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేశారు. దద్దమ్మలను తీసుకునే కంటే, టీ20 వరల్డ్ కప్ 2026 ఒంటిచేత్తో గెలిపించిన సంజు శాంసన్ ను తీసుకుంటే బెటర్ అన్నారు. సంజును తీసుకోవడమే కాకుండా, రోహిత్ శర్మకు జోడిగా ఓపెనర్ గా బరిలో దించాలని కూడా సోనాల్ చౌహాన్ రిక్వెస్ట్ చేసారు. రోహిత్, సంజు ఓపెనర్లుగా బరిలోకి దిగితే.. ప్రత్యర్థులకు నరకమే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో సంజు శాంసన్ పై నటి సోనాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రోహిత్ శర్మ లాగానే సంజు శాంసన్ తన ఫేవరేట్ క్రికెటర్ అంటూ బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక సమయాల్లో సంజు బ్యాటింగ్ ఇరగదీస్తాడని చెప్పారు. చాలా రోజుల నుంచి సంజు బ్యాటింగ్ ను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అతడు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, టీమిండియాలో అవకాశాలు సరిగ్గా రావడం లేదని మండిపడ్డారు. కేవలం టీ20ల్లో మాత్రమే తీసుకుంటున్నారని విమర్శలు చేశారు. వైభవ్ సూర్యవంశీ వచ్చాక అందులోనూ సంజుకు స్థానమే దక్కడమ లేదని ఫైర్ అయ్యారు. సంజు శాంసన్ ను సాధారణ ప్లేయర్ గా చూడటం మానేసి, మూడు ఫార్మాట్స్ ఆటగాడిగా చూడాలని కోరారు. అప్పుడే సంజు శాంసన్ భయకరమైన ప్లేయర్ గా కనిపిస్తాడని చెప్పుకొచ్చారు.తన మాట విని, 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా సంజు శాంసన్ ను తీసుకోవాలని కోరారు. రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా బరిలోకి దింపాలని తెలిపారు.అప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో సంజు శాంసన్ ను తీసుకునే ఛాన్సులు తక్కువేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. వన్డేలలో ఇప్పటికే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. అతడే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతాడని చెబుతున్నారు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్ దాదాపుగా ఖరారు అయినట్టేనని అంటున్నారు. అతడితో పాటు రిషబ్ పంత్ లేదా ఇషాన్ కిషన్ పేరు వినిపిస్తోంది. తప్ప సంజు శాంసన్ పేరు తెరపైకి రావడం లేదు. అతడిని టీ20 స్పెషలిస్ట్ గానే ట్రీట్ చేస్తున్నారు. ఈ లెక్కన బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ సూచించినట్టు, సంజును తీసుకోవడం కుదరదని అంటున్నారు.