OTT Movie : ఓటిటిలో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కొదవలేదు. రకరకాల స్టోరీలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిలో ఏలియన్స్ సినిమాలు, ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఏలియన్స్ మనుషులను నియంత్రిస్తూ ఉంటాయి. వీటితో ఒక ఒంటరి అమ్మాయి పోరాడుతుంది. ఈ సినిమా చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
బ్రిన్ ఒక చిన్న పట్టణంలోని అడవి ప్రాంతంలో, తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. ఆమె ఒక టైలర్‌గా పనిచేస్తూ, ఇంట్లోనే రకరకాల డిజైన్ లను తయ్యారు చేస్తుంటుంది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ మౌడ్, తల్లి సారా మరణంతో బాధపడుతూ ఉంటుంది. ఆమెతో ఊరిలో ఉన్నజనం ఎవ్వరూ పెద్దగా మాట్లాడరు. ఆమె గతం వల్ల అందరూ దూరం పెడుతుంటారు. అందుకే ఆమె ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు రాత్రి బ్రిన్ ఇంటిపై ఏలియన్స్ దాడి చేస్తాయి. ఈ ఏలియన్స్ కి కొన్ని అసాధారణ శక్తులు ఉంటాయి. ఇవి మానవుల గొంతులో పరాన్న జీవులను పంపించి వాళ్ళను నియంత్రిస్తుంటాయి. బ్రిన్ తన ఇంటిలో దాక్కుని, తెలివిగా పోరాడుతూ, ఒక ఏలియన్‌ను చంపుతుంది. అయితే తరువాత ఆమె ఊరిలోకి సహాయం కోసం వెళ్లాలని అనుకుంటుంది. వెళ్ళినా తనకు ఎవరూ సాయం చెయ్యరనుకుంటుంది. ముఖ్యంగా మౌడ్ తల్లి, బ్రిన్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారు ఏలియన్ నియంత్రణలో ఉన్నట్లు గుర్తిస్తుంది.
బ్రిన్ తిరిగి ఇంటికి వచ్చి ఏలియన్స్ రాకుండా , తన ఇంటిని బలంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోగా ఏలియన్స్ మళ్లీ దాడి చేస్తాయి. ఆమె ఒక చిన్న ఏలియన్‌ను కర్రతో, మరొక పెద్ద ఏలియన్‌ను కారుతో గుద్ది చంపుతుంది. మరో ఏలియన్ ఆమె గొంతులో ఒక జీవిని పంపించి తమ ఆధీనంలో ఉంచుకుంటాయి. ఈ ఏలియన్స్ ఆమె గతాన్ని చూడగలుగుతాయి. ఆమె తన చిన్నతనంలో మౌడ్‌తో గొడవపడి, ఆమెను రాయితో కొట్టి చంపి ఉంటుంది. పట్టణంలో ఆమెను వెలివేయబడడానికి కారణం కూడా అదే. బ్రిన్‌ను ఒక ఫ్లైయింగ్ సాసర్‌లోకి తీసుకెళతారు ఏలియన్స్. అక్కడ ఆమె జ్ఞాపకాలను పరిశీలించాక ఏలియన్స్ ఒక నిర్ణయానికి వస్తాయి. చివరికి ఏలియన్స్ తీసుకున్న నిర్ణయం ఏమిటి ? ఏలియన్స్ నుంచి బ్రిన్ బయట పడుతుందా ? ప్రజలు ఆమెను ఆదరిస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : నడి రోడ్డుపై కారు ఆగిపోతే… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ పేరు ‘నో వన్ విల్ సేవ్ యు’ (No One Will Save You). 2023 లో వచ్చిన ఈ మూవీకి బ్రియాన్ డఫీల్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో కైట్లిన్ దేవర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా దాదాపు డైలాగ్ లేకుండా, కేవలం విజువల్స్, సౌండ్ ద్వారా స్టోరీ తిరుగుతుంది. మొత్తం రన్‌టైమ్ లో కొన్ని డైలాగ్‌లు మాత్రమే పలకడం జరిగింది. ఈ స్టోరీ బ్రిన్ అనే ఒంటరి యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఊహించని విధంగా, ఒక ఏలియన్ దాడిని ఎదుర్కొంటుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.