Gundeninda GudiGantalu Today episode August 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి మాత్రం రౌడీలను కొట్టి నాకు స్కూటీ కొన్నారా అని అరిచిన మీనా ఉదయం లేవగానే స్కూటీని అందంగా ముస్తాబు చేసి ఉంటుంది. ఇంట్లోనే వాళ్ళందరిని పిలిచి పూజ చేసి బాలు మీనా ఇద్దరు సరదాగా ఒక రౌండ్ వేసేస్తారు. వాళ్ళిద్దరిలా చక్కగా బయటికి వెళ్లడం బాగుంది అని సత్యం మురిసిపోతూ ఉంటాడు. ప్రభావతి రోహిణి మాత్రం ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు.. మనము పూల కొట్టును తీసేయించాలి అని అనుకుంటే భారీ కోసం బాలు ఏకంగా స్కూటీనే కొనిచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారు.
మీనాను చూసిన కామాక్షి ప్రభావతికి కామాక్షి ఫోన్ చేసి మీనా ను ఇక్కడ చూశాను. బాలు మీనా కోసం స్కూటీ కొనిచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఆ పూల బాక్స్ పై నీ నెంబర్ ఇవ్వలేదు. అది నువ్వు సంతోషించాలి అని కామాక్షి అంటుంది. అదే కనుక చేసింటే ఈపాటికి నువ్వు బిజీ అయిపోయిదానివే కదా అని కామాక్షి అంటుంది. ప్రభావతి ఒక్కసారిగా ఆ పరిస్థితిని ఊహించుకొని షాక్ అవుతుంది. వామ్మో ఇలాంటి పరిస్థితి నాకు వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. కామాక్షి అన్నది కచ్చితంగా నిజమే.. తెలుసంటుందో తెలియక అంటున్నావు కానీ మిగతాలైతే మాట్లాడుతుంది అని ప్రభావతీ కామాక్షి మాటలు పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి మీరు సంతోషంగా ఉండాలని కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేశాను అత్తయ్య. ఆ సంతోషం కాసేపు కూడా ఉండలేదు. బాలు ఇలాగా స్మార్ట్ గా ఆలోచిస్తారని అస్సలు ఊహించలేదు అని రోహిణి బాలు పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇంత మంచి ఆలోచన బాలుకొస్తుందని అసలు అనుకోలేదు క్షమించండి అని అంటుంది.
దానికి ప్రభావతి నువ్వేం చేస్తావ్ లేమ్మా.. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది పోనీలే ఇంటి ముందర పూల కొట్టు లేకుండా పోయింది అని సంతోషపడుతుంది. ఇక అక్కడే ఉంటే వాళ్ళ నాన్న గురించి ఎక్కడ అడుగుతారు అని రోహిణి మెల్లగా జారుకుని పైకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోజ్ దిగులుగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఏంటి మనోజ్ అలా ఉన్నావ్ అని అడుగుతుంది.
బాలు మీనా గ్రేట్ కదా అని పొగుడుతాడు. బాలుకు మీనా సపోర్ట్ ఉంది. కాకపోతే సొంత డబ్బులతో మళ్ళీ తనకి కారు కొనిచ్చింది. బాలు మీనా పూల కొట్టు ని కార్పొరేషన్ వాళ్ళు తీసుకుపోతే ఏకంగా మొబైల్ పూల కొట్టును ఓపెన్ చేయించాడు. అసలు ఏం మాత్రం చదువుకొని ఇలాంటి మంచి మంచి ఐడియాలు రావడం గ్రేట్ కదా అని పొగడ్తలు వర్షం కురిపిస్తాడు మనోజ్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని అలా జీవితంలో ముందుకు వెళ్తున్నారు. నాక్కూడా అలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని మనోజ్ అంటాడు.
అయితే రోహిణి నేను నెల నెల నీకు ఖర్చులకి ఇస్తున్నాను కదా మనోజ్. ఇంకేమివాలి అని అడుగుతుంది. నాకు బిజినెస్ చేయాలని ఒక కల ఉంది. మీ నాన్నని అడిగి డబ్బులు ఇస్తే చేసుకుందామని అనుకున్నాను. ఆ మాట వినగానే రోహిణి నువ్వు నన్ను ప్రేమించావా నా ఆస్తిని ప్రేమించావని అడుగుతుంది. నేను నిన్నే ప్రేమించాను నా పరిస్థితి నేను అర్థం చేసుకోవాలి కదా అని మనోజ్ అంటాడు. నాన్న పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడం నాకు బాధగా అనిపిస్తుంది మనోజ్ అని రోహిణి అంటుంది.
Also Read : శ్రీవల్లి నాటకానికి చెక్ పెట్టబోతున్న నర్మదా.. బుట్టలో పడ్డ భాగ్యం..
నువ్వు మీ నాన్న ఇచ్చిన 40 లక్షలు ఎవరో అమ్మాయి మోసం చేసి తీసుకెళ్లింది అని అన్నావు కదా.. ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ 40 లక్షలు మళ్ళీ మనకు వస్తాయి కదా అని రోహిణి అంటుంది. ఎప్పుడో ఆమె కెనడాకు వెళ్లిపోయింది ఇప్పుడు ఎలా దొరుకుతాయి అని మనోజ్ అంటాడు. ఏదోక ఏజెన్సీ ద్వారానే ఆమె కెనడాకు వెళ్లి ఉంటది. నువ్వే ఫ్లైట్ టికెట్ బుక్ చేసానన్నావు కదా అక్కడ వెళ్లి ఎంక్వయిరీ చేద్దామని ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఆమె అడ్రస్ ని కనుక్కుంటారు. సోమవారం ఎపిసోడ్లో బాలు కారులో నుంచే ఆమె దిగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..