Hyderabad Crime News: ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులను వెంటాడి మరీ క్రూరంగా చంపుతారు. కన్న తల్లికి పిల్లల పట్ల ఆ క్రూరత్వం ఎందుకు వచ్చిందో తెలీదు. కేవలం అనారోగ్యం కారణంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కొడుకులను వేట కొడవలితో మెడ, తలపై నరికి చంపేసింది. చిన్నారుల కేకలతో ఇరుగుపొరుగువారు అలర్ట్ అయ్యారు. ఈలోగా ఆమె ఆరో అంతస్తు నుంచి దూకేసింది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని గాజుల రామారంలో చోటు చేసుకుంది.
స్టోరీలోకి వెళ్తే..
ఈ ఘటన వెనుక అసలేం జరిగింది? మృతురాలు రాసిన లేఖలో అసలు నిజాలేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి-తేజస్విని దంపతులు. ప్రస్తుతం గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఆశిష్‌రెడ్డికి ఏడేళ్లు కాగా, చిన్నవాడు హర్షిత్‌రెడ్డికి నాలుగేళ్లు. పెద్ద కొడుకు ఫస్ట్ క్లాస్ చదువుతుండగా, చిన్నోడు నర్సరీ చదువుతున్నాడు.
ఏం జరిగిందో తెలీదు. కాకపోతే ఇంట్లో భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా తేజస్వినికి కంటిచూపు సమస్య వేధించేది. ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా ఇబ్బంది పడుతోంది. దీనికితోడు ఆశిష్, హర్షిత్‌లకు శ్వాస కోశ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.
పిల్లలకు అనారోగ్య సమస్యలు
మూడునాలుగు గంటలకు ఒకసారి ముక్కు ద్వారా పిల్లలకు డ్రాప్స్ వేసింది తల్లి తేజస్విని. లేకపోతే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడతారు ఇద్దరు పిల్లలు. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. పిల్లలకు చిన్న వయస్సులో సమస్యలు రావడం సహజం. పెరిగిన కొద్దీ ఆ సమస్య క్రమంలో తగ్గుముఖం పడతాయి. ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది కన్న తల్లి.
ALSO READ: పాము డ్రామా.. భర్తకు ఊపిరాడకుండా చేసి, ఆపై ప్రియుడితో రొమాన్స్
గురువారం వెంకటేశ్వర్‌రెడ్డి ఎప్పటి మాదిరిగా డ్యూటీకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన ఆయన, పాఠశాలకు ఇదే చివరి రోజు కావడంతో పిల్లలకు కొన్ని పుస్తకాలు తెచ్చారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు పిల్లలపై శివాలెత్తింది తల్లి తేజస్విని. ఆ తర్వాత కోపం తీవ్రమైంది. ఆవేశంలో తాను ఏం చేస్తున్నానో తెలుసుకోలేక పోయింది. మృగంలా మారిపోయింది తేజస్విని.
వేటకొడవలితో క్రూరంగా
ఆ సమయంలో భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న వేటకొడవలితో పిల్లల తల, మెడ భాగంలో విచక్షణా రహితంగా నరికి చంపేసింది. పెద్ద కొడుకు ఆశిష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కన్న కొడుకులు లేని ఈ లోకంతో తనకు పనేంటని భావించింది. చివరకు వారు ఉంటున్న అపార్టుమెంటులో ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తేజస్విని.
ఈలోగా ఫ్లాట్ నుంచి గట్టిగా కేకలు రావడంతో ఇరుగుపొరుగువారు తేజస్విని ఇంటికి వెళ్లారు. కొన్ని కొడుకు కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. ఈలోగా వెంటనే భర్త వచ్చి చూసేసరికి ముగ్గురు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. భార్య, పిల్లల మరణంతో వెంకటేశ్వర్‌రెడ్డి కన్నీరుమున్నీరు అయ్యారు. ఆయన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
లేఖలో అసలు విషయం
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఇంట్లోని అన్ని ప్రాంతాలు పరిశీలించారు. చివరకు ఏడు పేజీల లేఖ దొరికింది. అందులో పిల్లలకు నాలుగైదు గంటలకోసారి డ్రాప్స్ వేయకపోతే ఇబ్బందిపడతారు. వైద్యం చేయించడానికి భర్త సహకరించడం లేదు. రోజురోజుకూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
భర్త ఇంట్లో ఉన్న సమయంలో చీటికి మాటికీ చికాకు, కోపంతో ఉంటారని పేర్కొంది. తనతోపాటు పిల్లల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోందని ప్రస్తావించింది. పిల్లలకు చిన్న గాయమైతే తట్టుకోలేని కన్నతల్లి, పెంచిన చేతులతో మరణ శాసనం రాసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.