E-Paper
Advertisement

ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు.. నెట్‌ఫ్లిక్స్‌ను రూల్ చేస్తోన్న నెంబర్ 1 సిరీస్ ఇదే!

ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు.. నెట్‌ఫ్లిక్స్‌ను రూల్ చేస్తోన్న నెంబర్ 1 సిరీస్ ఇదే!
Advertisement

Fantasy Adventure Series : అద్భుతమైన విజువల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది లాస్ట్ ఎయిర్ బెండర్’ను అందరూ చూసే ఉంటారు. తాజాగా ఈ సిరీస్ నుంచి సీజన్ 2 ఓటిటిలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో జూన్ 25 నుంచి ‘అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2’ (Avatar: The Last Airbender season 2 Series) స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ యానిమేటెడ్ సిరీస్లోని ‘బుక్ టు ఎర్త్’ ఆధారంగా తెరకెక్కిన ఈ సీజన్ పూర్తి కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

కథలోకి వెళ్తే…

సీజన్ వన్ ఎండింగ్లో నార్తర్న్ వాటర్ ట్రైబ్ ను రక్షించిన తర్వాత… ఆంగ్, కటారా, సోక్కా కలిసి ఎర్త్ కింగ్డమ్ వైపు ప్రయాణం సాగిస్తారు. రాబోయే తోకచుక్క ప్రమాదం గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం, ఆంగ్ కు ఎర్త్ బెండింగ్ నేర్పే ఒక గురువును వెతకడం అన్నదే వీరి ప్రయాణం వెనుకున్న ప్రధాన లక్ష్యం.

Advertisement

ఆంగ్ తన మొదటి గురువుగా కింగ్ భూమిని సెలెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. కానీ భూమి రిజెక్ట్ చేసి, సౌండ్ ను బాగా గ్రహించే మరొకరిని వెతకమని చెప్తాడు. ఈ క్రమంలోనే ఆంగ్ కు తోప్ బెయిఫాంగ్ పరిచయం అవుతుంది. అయితే ఆమె పుట్టుకతోనే అందురాలు. కానీ భూ ప్రకంపనల ద్వారా శత్రువులను గుర్తించగల అత్యంత శక్తివంతమైన ఎర్త్ బెండర్ ఆమె. మొదట్లో ఈ అమ్మాయి ఆంగ్ తో గొడవలు పడుతుంది. కానీ చివరకు ఆంగ్ కు ఎర్త్ బెండింగ్ నేర్పడానికి ఒప్పుకొని, వాళ్ళ గ్రూపులో చేరుతుంది.

ఆంగ్ తో పాటు అతని స్నేహితులు ఎర్త్ కింగ్డమ్ రాజధాని అయిన బా సింగ్ సే అనే అతిపెద్ద రక్షణ గోడల నగరంలోకి ప్రవేశిస్తారు. కానీ ఆ నగరంలో ఎలాంటి యుద్ధం లేదు అనే ఒక విచిత్రమైన భ్రమలో జనాలను ఉంచుతారు. అక్కడ పాలకుడు కింగ్ కుయ్ కేవలం నామమాత్రపు రాజుగా ఉంటాడు. కానీ అసలు అధికారం అంతా లాంగ్ ఫ్రాంక్ అనే క్రూరమైన మంత్రి, అతని రహస్య సైన్యం డైలీ చేతుల్లో ఉంటుంది. వీళ్లంతా యుద్ధానికి సంబంధించిన నిజాలను దాస్తూ, ఆంగ్ తో పాటు అతని స్నేహితులకు అడ్డంకులు క్రియేట్ చేస్తారు. అదే సమయంలో ఆంగ్ వాహనం అప్పాను కిడ్నాప్ చేస్తారు.

Advertisement

ఇంకోవైపు ఫైర్ నేషన్ నుంచి ద్రోహులుగా ప్రకటించబడిన ప్రిన్స్ జుకో, అతని బాబాయ్ ఐరో ప్రాణాలు రక్షించుకోవడానికి ఎర్త్ కింగ్ లో సామాన్యులుగా మారువేషంలో బతుకుతారు. ఫైర్ నేషన్ క్రూరమైన యువరాణి అజులా తన స్నేహితురాలు మై, టైలర్లతో కలిసి బా సింగ్ సే నగరంలోకి సీక్రెట్ గా అడుగు పెడుతుంది. ఆమె మంత్రి లాంగ్ ఫ్రాంక్ ను మోసగించి, డైలీ సైన్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతేకాకుండా జుకొను మళ్ళీ ఫైర్ నేషన్ రాకుమారుడుగా మారుస్తానని ఆశ చూపి తన వైపుకు తిప్పుకుంటుంది.

ఇక కథ చివర్లో భూగర్భ గుహలో జరిగే ఆంగ్ భారీ యుద్దంలో స్టేట్లోకి వెళ్తుండగా, అజులా అతనిపై మెరుపు దాడి చేస్తుంది. దీంతో తీవ్రంగా గాయపడి దాదాపు చనిపోయిన పరిస్థితుల్లోకి వెళ్తాడు. మరి అలాంటప్పుడు ఆంగ్ ను అతని ఫ్రెండ్స్ ఎలా కాపాడారు ? చివరకు అత్యంత బలమైన బా సింగ్ సే నగరం ఫైర్ నేషనల్ వశం ఎలా అయింది ? క్లైమ్యాక్స్ లో ఏం జరుగుతుంది ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : చేయని నేరానికి జైలుకెళ్ళి ఎస్కేప్… చచ్చిన కొడుకుని వెతుక్కుంటూ… మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×