E-Paper
Advertisement

ఓటీటీలో క్షణ క్షణం భయం పుట్టించే హారర్ థ్రిల్లర్లు… వీకెండ్ లో వీటిని చూస్తే భలే మజా

ఓటీటీలో క్షణ క్షణం భయం పుట్టించే హారర్ థ్రిల్లర్లు… వీకెండ్ లో వీటిని చూస్తే భలే మజా
Advertisement

Best Horror Thriller Movies on OTT : వీకెండ్‌ వచ్చిందంటే చాలు, చాలామంది మొబైల్స్, టీవీల్లో ఏవో ఒక సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తుంటారు. అయితే ఒకవేళ వీకెండ్స్ లో రూమ్ తలుపులన్నీ వేసేసి, లైట్లు ఆపేసి, ఒంటరిగా గూస్‌బంప్స్ తెప్పించే సినిమాలు చూడాలనుకుంటే మాత్రం ఈ లిస్ట్ మీకోసమే. రాత్రిపూట ఒంటరిగా కూర్చుని వీటిని చూస్తే మాత్రం ప్యాంటు తడిచిపోవడం ఖాయం. గుండె ధైర్యం ఉన్నవాళ్లే ముట్టుకోవాల్సిన ఆరు అదిరిపోయే హారర్ థ్రిల్లర్ సినిమాలు, వాటి స్టోరీలు, అవి దొరికే ఓటీటీల పై ఓ లుక్ వేద్దాం పదండి.

1. ఐ సీ యూ (I See You – 2019)

ఇదొక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ హారర్ థ్రిల్లర్. ఒక ఊర్లో చిన్న పిల్లలు మాయమైపోతుంటారు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే కొన్ని వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఇంట్లో వస్తువులు అవే మాయమవడం, టీవీలు అవే ఆన్ కావడం లాంటివి చూసి దెయ్యం అనుకుంటారు. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అస్సలు ఊహించని రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమా Airtel Xstream Play లోనూ, జియో సినిమా (JioHotstar) లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

2. హుష్ (Hush – 2016)

Advertisement

మామూలుగానే హారర్ సినిమాల్లో అరుపులు, కేకలు ఉంటే భయమేస్తుంది. అయితే ఈ సినిమాలో సైలెన్స్ తోనే చంపేస్తారు. ఒక మూగ, చెవుడు ఉన్న అమ్మాయి అడవి మధ్యలో ఒంటరిగా ఇంట్లో బతుకుతుంటుంది. ఒక సైకో కిల్లర్ మాస్క్ వేసుకుని ఆమెను చంపడానికి వస్తాడు. ఆమెకు వినపడదు, మాట్లాడలేదు కాబట్టి ఆ సైకో నుండి ఎలా తప్పించుకుందనేది ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటుంది.
ఇక్కడ. ఈ సూపర్ హిట్ హోమ్ ఇన్వేషన్ థ్రిల్లర్ ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

3. ఎడెన్ లేక్ (Eden Lake – 2008)

ఇది దెయ్యం సినిమా కాదు, కానీ దెయ్యాల కంటే ఘోరమైన మనుషుల సినిమా. ఒక లవర్స్ జంట వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఒక అందమైన సరస్సు దగ్గరకు వెళ్తారు. అక్కడ కొంతమంది ఆకతాయి కుర్రాళ్లతో వీళ్లకు గొడవ అవుతుంది. ఆ చిన్న గొడవ కాస్తా ఎంత భయంకరమైన వేటకు దారితీసింది అనేది చాలా వయలెంట్‌గా చూపిస్తారు. క్లైమాక్స్ చూస్తే గుండె బరువెక్కిపోతుంది. సర్వైవల్ థ్రిల్లర్ Amazon Prime Video లో చూడవచ్చు.

4. అబ్సెంటియా (Absentia – 2011)

Advertisement

ప్రముఖ హారర్ డైరెక్టర్ మైక్ ఫ్లానగన్ తీసిన లో బడ్జెట్ మాస్టర్ పీస్ ఇది. ఇందులో ఒక మహిళ భర్త ఏడేళ్ల క్రితం మాయమైపోతాడు. ఆమె తన చెల్లితో కలిసి ఆ బాధ నుండి బయటపడాలని చూస్తున్న టైంలో, వాళ్ల ఇంటి పక్కన ఉన్న ఒక సొరంగంలో ఏదో వింత శక్తి ఉందని తెలుసుకుంటారు. ఆ టన్నెల్ లోకి వెళ్లిన వాళ్లంతా ఏమైపోతున్నారనేది చాలా భయపెడుతూ సాగుతుంది. ఈ మిస్టరీ హారర్ మూవీ Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

5. ఆక్యులస్ (Oculus – 2013)

ఒక పాతకాలపు అద్దం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ అద్దం ఇంట్లోకి వచ్చాక ఒక ఫ్యామిలీ ఎలా నాశనమైంది. తల్లిదండ్రులు ఎలా పిచ్చోళ్లయి చనిపోయారు అనేది స్టోరీ. పెద్దయ్యాక ఒక అన్న చెల్లెలు ఆ అద్దంలో ఉన్న దుష్టశక్తిని అంతం చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆ అద్దం వాళ్లతో ఆడుకుంటుంది. ఇందులో ఏది నిజం, ఏది భ్రమ అనేది కనిపెట్టడం అసాధ్యం. ఈ మైండ్ బెండింగ్ హారర్ సినిమా లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) లో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభిస్తుంది.

6. డెత్‌డ్రీమ్ (Deathdream – 1974)

ఇదొక పాత క్లాసిక్ హారర్ సినిమా. యుద్ధానికి వెళ్లిన ఒక కొడుకు చనిపోయాడని ఇంటికి సమాచారం వస్తుంది. కానీ ఒక రాత్రి ఆ కొడుకు తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. కొడుకు వచ్చాడని ఆ ఫ్యామిలీ మురిసిపోతుంది. అయితే అతని ప్రవర్తనలో ఏదో తేడా ఉంటుంది. ఆ ఊర్లో వింత హత్యలు కూడా జరుగుతుంటాయి. ఈ సైకలాజికల్ క్లాసిక్ మూవీ ప్రస్తుతం ప్లెక్స్ (Plex)లో ఫ్రీగా చూడవచ్చు.

Read Also : కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కొరియన్ హారర్లు… వీటి ట్రైలర్లు చూస్తేనే వణికిపోతారు

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×