Best Malayalam Thrillers : మలయాళ సినిమా థ్రిల్లర్ జానర్‌లో తనదైన మార్క్ సృష్టిస్తోంది. సస్పెన్స్, మైండ్ గేమ్స్, యాక్షన్, ఎమోషనల్ డెప్త్‌తో నిండిన మాలీవుడ్ చిత్రాలు ఓటీటీలో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఈ ఏడాది హైలైట్ అయిన టాప్ 5 మలయాళం థ్రిల్లర్ సినిమాల వివరాలను తెలుసుకుందాం. మలయాళం మూవీ లవర్స్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన బెస్ట్ న్యూ మూవీస్ ఏంటి అంటే…
ఇదొక గ్రిప్పింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. బిజు మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అవినీతి పోలీస్ ఆఫీసర్ ఒక సాధారణ వ్యక్తి కుమార్తె అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేస్తాడు. విచారణ లోతుగా వెళ్లే కొద్దీ ఆ అధికారి షాకింగ్ గతం, కుటుంబ రహస్యాలు, నైతికత vs నేరం మధ్య జరిగే మైండ్ గేమ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. జీతూ జోసెఫ్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి బలం చేకూర్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ ఐ ఫీస్ట్. ManoramaMAXలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాజిల్లు కలిసి నటించిన హై-వోల్టేజ్ పొలిటికల్ స్పై థ్రిల్లర్. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశ భద్రతకు ముప్పుగా మారే అంతర్జాతీయ డిజిటల్ సర్వైలెన్స్ కుట్ర, సీక్రెట్ ఏజెంట్లు సమయంతో పోటీ పడుతూ ఆ కుట్రను ఎలా ఛేదించారనే స్టోరీతో నడుస్తుంది. హై టెన్షన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ మూవీ ఆకట్టుకుంటుంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం బిగ్ బడ్జెట్ స్పై థ్రిల్లర్‌గా గుర్తింపు పొందింది. ZEE5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
దట్టమైన అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఏనుగు దంతాల స్మగ్లింగ్ మాఫియా, క్రూరమైన వేటగాడు, వారిని అడ్డుకోవాలని చూసే ఫారెస్ట్ అధికారుల మధ్య జరిగే పగ, మనుగడ పోరాటం ఈ చిత్రం ముఖ్యాంశం. అడవి వాతావరణం, హై యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎకాలజీ-క్రైమ్ కలయిక ఈ చిత్రాన్ని ప్రత్యేకం చేశాయి. సస్పెన్స్‌తో పాటు వైల్డ్ లైఫ్ థ్రిల్ ఇష్టపడేవారికి ఇది మస్ట్ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిందే. మే 28 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇంకా వెల్లడి కావలసి ఉంది.
ఇదొక పోలీస్ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ డ్రామా. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐకి అసలు క్రైమ్ రేట్ పెద్దగా లేని ఊర్లో పోస్టింగ్ వస్తుంది. దీంతో ఆ పోలీస్ తెగ సంతోషపడిపోతాడు. కానీ తీరా కొన్ని రోజుల్లోనే ఆయన ఆనందాన్ని ఆవిరి చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వరుస మర్డర్స్, బ్యాంక్ దోపీడీ ఆ ఊర్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదొక సైకలాజికల్ హర్రర్ డ్రామా. ఓ అమాయకపు ఫ్యామిలీ అనుకోకుండా తమను వేధిస్తున్న వాడిని మర్డర్ చేస్తారు. ఆ తరువాత బాడీని దాచడానికి వాళ్ళు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగే ఈ కామెడీ కథ ఫ్యామిలీతో కలిసి చూడడానికి బాగుంటుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.