E-Paper
Advertisement

ఒక్కసారి చూస్తే మరిచిపోలేని వార్ మూవీస్… క్లైమాక్స్ వరకు కుర్చీలకు అతుక్కుపోయేలా

ఒక్కసారి చూస్తే మరిచిపోలేని వార్ మూవీస్… క్లైమాక్స్ వరకు కుర్చీలకు అతుక్కుపోయేలా
Advertisement

Best War Movies on OTT : ఓటీటీలో వార్ సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. యుద్ధ సన్నివేశాలతో ఇవి దద్దరిల్లుతుంటాయి. అయితే కొన్ని సినిమాలలో ఎమోషన్స్ యుద్ధానికి మించి ఉంటాయి. ఈ సినిమాలను చూస్తే అస్సలు ఎప్పటికీ మరిచిపోలేరు కూడా. అసలు యుద్ధం అంటే కేవలం బాంబులు, తుపాకులు మాత్రమే కాదన్నట్లు ఉంటుంది. ఈ సినిమాలు చూశాక ఆ సీన్లు మన కళ్ల ముందే తిరుగుతుంటాయి. ఎమోషనల్ గా ఈ సినిమాలు గుండెను పిండేస్తాయి. అలాంటి అదిరిపోయే కంటెంట్ ఉన్న ఈ 5 సినిమాలు, క్లైమాక్స్ వరకు సీటు అంచున కూర్చోబెడతాయి.

1. ది విండ్ దట్ షేక్స్ ది బార్లీ (2006)

ఇది ఐర్లాండ్ ఇండిపెండెన్స్ పోరాటం గురించి. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు దేశం కోసం కలిసి పోరాడుతారు. కానీ చివరికి ఒకరి మీద ఒకరు తుపాకీ గురిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత తమ్ముణ్ణి చంపాల్సి వస్తే ఆ అన్న మనసు ఎంత విలవిలలాడుతుందో ఈ సినిమాలో చూడొచ్చు. ఇది Amazon Prime, Apple TV లో అందుబాటులో ఉంది.

2. ఏ మిడ్‌నైట్ క్లియర్ (1992)

Advertisement

అమెరికన్, జర్మన్ సైనికులు, యుద్ధం మధ్యలో ఒక మంచు అడవుల్లో ఎదురవుతారు. ఒకరినొకరు చంపుకోవడానికి బదులు, క్రిస్మస్ టైమ్‌లో కలిసి ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో స్టోరీ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ఇది YouTube, Amazon Prime లో దొరుకుతుంది.

3. రెస్క్యూ డాన్ (2006)

వియత్నాం యుద్ధంలో శత్రువులకు చిక్కిన ఒక పైలట్ కథ ఇది. ఇందులో క్రిస్టియన్ బేల్ నటన చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. జైలు నుండి తప్పించుకోవడానికి అతను చేసే సర్కస్, అడవిలో తిండి లేక పడే కష్టాలు చూస్తే మనకు చెమటలు పడతాయి. ఇది కంప్లీట్ సర్వైవల్ థ్రిల్లర్. Amazon Prime Video లో దీనిని చూడొచ్చు.

4. కమ్ అండ్ సీ (1985)

Advertisement

ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాలి. యుద్ధంలో నాజీలు చేసిన అరాచకాలు ఎలా ఉంటాయో ఒక చిన్న పిల్లోడి ద్వారా చూపిస్తారు. ఇది సినిమా చూసినట్లు ఉండదు, ఒక భయంకరమైన ప్లేస్ లో మనం ఉన్నట్లు అనిపిస్తుంది. YouTube లో దీనిని ఫ్రీగా చూడొచ్చు.

5. ది థిన్ రెడ్ లైన్ (1998)

పెద్ద పెద్ద స్టార్స్ తో ఈ సినిమా మాత్రం చాలా సీరియస్‌గా సాగుతుంది. యుద్ధం మనుషులను ఎలా పిచ్చోళ్లను చేస్తుంది, ప్రకృతిని ఎలా నాశనం చేస్తుంది అనేది చాలా డీప్‌గా చూపిస్తారు. ఇందులో విజువల్స్ మాత్రం వేరే లెవల్‌లో ఉంటాయి. Jio Hotstar లో ఇది అందుబాటులో ఉంది.

Read Also : కిల్లర్ వలలో చిక్కుకున్న ఒంటరి అమ్మాయి… రాత్రంతా పరుగులు పెట్టించే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Related News

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

Big Stories

Advertisement
×