BigTV English

OTT Movie : బాయ్ ఫ్రెండ్ గొంతుకోసి… బాత్రూంలోనూ వదలని దెయ్యం… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ రివేంజ్ డ్రామా

OTT Movie : బాయ్ ఫ్రెండ్ గొంతుకోసి… బాత్రూంలోనూ వదలని దెయ్యం… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ రివేంజ్ డ్రామా

OTT Movie : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలు చివరి వరకు కుర్చీలకి కట్టిపడేస్తాయి. ఒక డిఫరెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్ డబుల్ రోల్ నటన, సినిమా క్రీపీ వాతావరణం, సౌండ్ డిజైన్ కు ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా ఒక రివేంజ్ థ్రిల్లర్ గా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే  …


రెండు ఒటిటిలలో స్ట్రీమింగ్

‘లుక్’ అవే (Look Away) 2018లో విడుదలైన కెనడియన్ సైకలాజికల్ హారర్ సినిమా. ఇది అసాఫ్ బెర్న్‌స్టెయిన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ఇండియా ఐస్లీ, జాసన్ ఐసాక్స్, మీరా సోర్వినో, పెనెలోప్ మిచెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరియా అనే ఒక హైస్కూల్ అమ్మాయి కథ. ఆమె జీవితం తన అద్దంలోని ప్రతిబింబంతో మారిపోతుంది. బెట్రాయల్, రివెంజ్, సైకలాజికల్ టెన్షన్‌తో నిండిన ఈ చిత్రం, హారర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో ‘లుక్ అవే’కి 5.8/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

మరియా (ఇండియా ఐస్లీ) అనే 17 ఏళ్ల అమ్మాయి, హైస్కూల్‌లో చాలా ఒంటరిగా ఉంటుంది. స్కూల్‌లో మార్క్ అనే క్లాస్‌మేట్ ఆమెను ఎప్పుడూ ఏడిపిస్తుంటాడు. ఆమె ఏకైక స్నేహితురాలు లిల్లీతో కూడా సమస్యలు వస్తాయి. ఎందుకంటే మరియా లిల్లీ బాయ్‌ఫ్రెండ్ సీన్‌ను లోలోపల ఇష్టపడుతుంటుంది. ఇంట్లో కూడా ఆమెకు సపోర్ట్ ఉండదు. ఆమె తండ్రి డాన్ (జాసన్ ఐసాక్స్) ఒక ప్లాస్టిక్ సర్జన్. అతను ఆమెను ఎప్పుడూ అందంగా ఉండమని, పర్ఫెక్ట్‌గా కనిపించమని ఒత్తిడి చేస్తుంటాడు. ఆమె తల్లి ఏమీ (మీరా సోర్వినో) డిప్రెషన్‌తో బాధపడుతూ, ఎప్పుడూ నైట్‌మేర్స్‌తో సతమతమవుతుంది. మరియా అందరి నుండి ఒంటరిగా ఫీల్ అవుతూ, తన అద్దంలోని ప్రతిబింబంతో మాట్లాడుతుంటుంది. ఒక రోజు మరియా బాత్‌రూమ్‌లో ఉండగా, ఆమె అద్దంలోని ప్రతిబింబం సొంతంగా కదలడం చూస్తుంది. ఆమెను భయపెడుతుంది. ఈ ప్రతిబింబం ఏరమ్ గా పరిచయం అవుతుంది. ఆమె మరియాకు ధైర్యంగా ఉండమని, తన జీవితాన్ని మార్చుకోమని చెబుతుంది. ఏరమ్ బయటకు వచ్చి మరియా జీవితాన్ని లీడ్ చేస్తుంది.

Read Also : పెయింటర్ తో ప్రేమ… చదువుకోమని పంపిస్తే ఇదేం పిచ్చి పని పాపా?… డైరెక్టర్ ను అనాలి

ఏరమ్ మొదట్లో మరియాకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. స్కూల్‌లో ఆమెను ఏడిపించేవాళ్లను ఎదిరిస్తుంది. సీన్‌తో రొమాన్స్ మొదలెడుతుంది. మరియా లోపల దాచుకున్న కోరికలను బయటపెడుతుంది. కానీ ఏరమ్ రానురాను చీకటి రూపం బయటపడుతుంది. ఆమె మరియా కోరికలను తీర్చడం కాదు, తన సొంత రివెంజ్ ప్లాన్‌ను అమలు చేస్తుంది. ఏరమ్ సీన్‌ను, లిల్లీని, మరియా తండ్రి డాన్‌ను టార్గెట్ చేస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది. ఒక షాకింగ్ సీన్‌లో, ఏరమ్ డాన్ ముందు బట్టలు లేకుండా నిలబడి, తనను లవ్ చేయమని అడుగుతుంది, ఆ తర్వాత అతని గొంతు కోసి చంపేస్తుంది. కథలో కీలక రహస్యం బయటపడుతుంది. మరియా ఒక సోనోగ్రామ్‌లో కవలల గురించి చూస్తుంది. అంటే ఆమెకు ఒక కవల సోదరి ఉండేది. కానీ డాన్ ఆమెను పుట్టినప్పుడు అని చంపేస్తాడు. ఏరమ్ అనేది మరియా చనిపోయిన కవల సోదరి ఆత్మ. ఆమె రివెంజ్ కోసం తిరిగి వచ్చింది. క్లైమాక్స్‌ మరో అదిరిపోయే ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఏరమ్ నుంచి మరియా బయటపడుతుందా ? మరియా ఇంకా సమస్యలు సృష్టిస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×