OTT Movie : సైకో సినిమాలను తీయడంలో హాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది. ఇటువంటి సినిమాలలో వైలెన్స్ సన్నివేశాలను థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తుంటారు మేకర్స్. ఎన్నో రకాల స్టోరీలతో ఇటువంటి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక అమ్మాయి రోడ్ ట్రిప్ వెళ్తుండగా జరుగుతుంది. సుధీర్ఘమైన ఎడారి ప్రాంతంలో ఛేసింగ్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
బాబీ అనే అమ్మాయి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ను కలవడానికి కారులో వెళ్తూ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళడానికి ఈమె న్యూ మెక్సికో ఎడారిలో ప్రయాణిస్తుంది. ఆమె ఒక గ్యాస్ స్టేషన్ వద్ద ఆగినప్పుడు, షెరీఫ్ అనే వ్యక్తి ఆమెను గమనిస్తాడు. షెరీఫ్ హైవే పెట్రోలింగ్ చేస్తూ, యువతులను టార్గెట్ చేసే ఒక సీరియల్ కిల్లర్. ఇతను సిటీ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ నాలుకలను కట్ చేసి మరీ చంపుతుంటాడు. ఈ క్రమంలో స్పీడ్ గా డ్రైవింగ్ చేసినందుకు బాబీని అరెస్ట్ చేస్తానని అతను బాబీని బెదిరిస్తాడు. ఆమె ఇప్పుడు ఒక భయంకరమైన ఉచ్చులో చిక్కుకుంటుంది. అతని నిజ స్వరూపం తెలుసుకున్నబాబీ తన తెలివితేటలను ఉపయోగించి, ఈ క్రూరమైన షెరీఫ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
గతంలో కూడా అతని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. మధ్యలో వచ్చిన ఒక వ్యక్తి విషయం గ్రహించేలోపే అతన్ని కిల్లర్ దారుణంగా చంపేస్తాడు. ఇక షెరీఫ్‌ను ఎదుర్కోవడం తప్ప ఆమెకు వేరే మార్గం కనిపించకుండా పోతుంది. చివరికి బాబీ ఆ సైకో కిల్లర్ నుంచి తప్పించుకుంటుందా ? అతని చేతుల్లో బలి అవుతుందా ? కిల్లర్ ఎందుకు నాలుకలను కట్ చేస్తున్నాడు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లడ్ స్టార్’ (Blood Star). 2024 లో విడుదలైన ఈ సినిమాకి లారెన్స్ జాకోమెల్లి దర్శకత్వం వహించారు. ఇందులో జాన్ స్క్వాబ్, బ్రిట్నీ కామాచో, సిడ్నీ బ్రమ్‌ఫీల్డ్, ట్రావిస్ లింకన్ కాక్స్, ఫెలిక్స్ మెర్‌బ్యాక్ వంటి నటులు నటించారు. ఈ సినిమా స్టోరీ న్యూ మెక్సికో ఎడారిలో జరుగుతుంది. యూరప్‌లోని పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.