OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. వీళ్ళు చేసే హింస దెయ్యాలు కూడా చెయ్యవు. ఈ సినిమాలు ప్రతి క్షణం ఇంటెన్స్ తో ఆడియన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా వరుస హత్యలు చేస్తున్న కిల్లర్ ని, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ, పట్టుకునే క్రమంలో నడుస్తుంది. క్లైమాక్స్ లో స్టోరీ ఊహించని మలుపులతో పిచ్చెక్కిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Bone Face’ మైఖేల్ డొనోవన్ హార్న్ దర్శకత్వంలో వచ్చిన అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో జెరెమీ లండన్, ఎలెనా సాంచెజ్, మాడిసన్ వోల్ఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జనవరి 21 నుంచి ఈ సినిమా Amazon Prime, Apple TV, Tubiలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1 గంట 34 నిమిషాల నిడివితో IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది.
కౌన్సెలర్‌ల క్యాంప్ లో జరిగే ఒక రక్తపాతంతో ఈ కథ మొదలవుతుంది. ఒక ముసుగు ధరించిన బోన్ ఫేస్ అనే హంతకుడు, కౌన్సెలర్‌లను గొడ్డలితో ఘోరంగా ఊచకోత కోస్తాడు. ఈ మారన హోమంలో తొమ్మిది మంది చనిపోతారు. ఈ దారుణ ఘటన తర్వాత, పోలీస్ ఆఫీసర్ విన్స్ క్రోనిన్, అతని అసిస్టెంట్ జో మెక్‌కుల్లీ హంతకుడిని ట్రాక్ చేస్తూ సమీపంలో ఉండే 24/7 రెస్టారెంట్ కు చేరుకుంటారు. దాని బయట కనిపించిన బోన్ ఫేస్ మాస్క్, దుస్తులు హంతకుడు లోపల ఉన్నాడని అనిపిస్తుంది. అయితే విచిత్రంగా ఈ రెస్టారెంట్ లో కొంత మంది వ్యక్తులు ఉంటారు. అందరూ అనుమానితులుగానే ఉంటారు.
పోలీసులు తెలివి తేటలను ఉపయోగించి, అక్కడ హంతకుడిని నిర్ధారించడానికి రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఈ రాత్రి సమయంలో, ఊహించని ట్విస్ట్‌లతో కథలో ఉద్రిక్తత పెరుగుతుంది. క్లైమాక్స్‌లో అనేక ట్విస్ట్‌ల తర్వాత పోలీసులు బోన్ ఫేస్ ఎవరో కనిపెడతారు. క్లైమాక్స్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారా ? లేకపోతే బోన్ ఫేస్ చేతిలో వీళ్ళు కూడా బలవుతారా ? కౌన్సెలర్‌లను బోన్ ఫేస్ ఎందుకు చంపాడు ? అనే విషయాలను, ఈ అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్