BigTV English

OTT Movie : 15 దేశాల్లో బ్యాన్ చేసిన మూవీ… తీరని కోరికతో అల్లాడే జంట… బ్లడీ వయోలెన్స్… థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : 15 దేశాల్లో బ్యాన్ చేసిన మూవీ… తీరని కోరికతో అల్లాడే జంట… బ్లడీ వయోలెన్స్… థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఊహకందని స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఈ సినిమాలో అమ్మాయిలను అపహరించి వృద్ధాప్యాన్ని నివారించే పరీక్షలకు ఉపయోగిస్తుంటారు. ఈ సినిమాలో ఉండే తీవ్రమైన హింస కారణంగా కొన్ని దేశాలలో ఈ సినిమాని బ్యాన్ చేశారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘బ్రీడర్’ (Breeder)(2020) ఒక డానిష్ హారర్-థ్రిల్లర్ సినిమా. దీనికి జెన్స్ డాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సారా హిజోర్ట్ డిట్లెవ్‌సెన్, సిగ్నే ఎగ్హోల్మ్ ఒల్సెన్, ఆండర్స్ హెన్రిక్సెన్, మోర్టెన్ హోల్స్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా యువతులను కిడ్నాప్ చేసి వారిపై భీకరమైన ప్రయోగాలు చేసే ఒక క్రూరమైన వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2020 అక్టోబర్ 31న విడుదలై, IMDbలో 5.0/10 రేటింగ్‌ ను పొందింది. ఈ సినిమా Amazon Prime Video, Plexలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

మియా లిండ్‌బర్గ్ ఒక ఈక్వెస్ట్రియన్ రైడర్. ఒలింపిక్స్‌లో డెన్మార్క్‌ కు ప్రాతినిధ్యం వహించాలనే కలలు కంటూ ఉంటుంది. ఆమె తన భర్త థామస్ అనే ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌తో కలిసి జీవిస్తుంటుంది. అయితే వీరి వివాహంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మియా ఒక బిడ్డను కనాలని కోరుకుంటుంది. కానీ థామస్ ఈ విషయంలో అంతగా ఆసక్తి చూపించడు. ఈ నేపథ్యంలో పొరుగున ఉండే నీకా అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ తర్వాత తప్పించుకుని తిరిగి వస్తుంది. నీకాను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో థామస్ నిర్లక్ష్యం చేయడంతో, మియా సందేహపడుతూ, ఈ కిడ్నాప్ వెనుక ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి స్వయంగా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. మియా ఒక ప్రముఖ హెల్త్ సప్లిమెంట్ కంపెనీ గురించి తెలుసుకుంటుంది.

దీనిని డాక్టర్ రూబెన్ అనే క్రూరమైన మహిళా వ్యాపారవేత్త నడుపుతుంటుంది. ఈ కంపెనీ యువతులను కిడ్నాప్ చేసి, వారి డీఎన్‌ఏను బయో-హ్యాకింగ్ ద్వారా వృద్ధాప్య ప్రక్రియను రివర్స్ చేసే ఒక భీకరమైన ప్రయోగం చేస్తోంది. ఈ ప్రయోగం ధనవంతులైన క్లయింట్‌లకు యవ్వనాన్ని అందించడానికి చేస్తుంటారు. దీని వల్ల అంతులేని డబ్బు వస్తుందని రూబెన్ అనుకుంటుంది. మియా ఈ రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నంలో ఒక భయంకరమైన భవనంలో చిక్కుకుంటుంది. అక్కడ ఆమెను ఖైదీగా ఉంచుతారు. ఈ సమయంలో చాలా మంది యువతులు కూడా ఇక్కడ బందీలుగా ఉన్నారని ఆమె తెలుసుకుంటుంది.

Read Also : మరదలు అనుకుని దెయ్యాన్ని కిడ్నాప్… కట్ చేస్తే మరో దెయ్యం ఎంట్రీ… అడ్డంగా బుక్కయ్యే బకరాలు

డాక్టర్ రూబెన్‌కు ది డాగ్, ది స్వైన్ అనే ఇద్దరు సహాయకులు ఉంటారు. ది డాగ్ ఒక సాడిస్టిక్, మహిళలపై ద్వేషం ఉన్న వ్యక్తి. అతను మహిళలను కిడ్నాప్ చేసి హింసిస్తుంటాడు. ఈ భీకరమైన వాతావరణంలో మియా తన బలాన్ని ఉపయోగించి, బందీలుగా ఉన్న ఇతర మహిళలతో కలిసి తప్పించుకునేందుకు పోరాడుతుంది. ఇక ఈ సినిమా ఒక భయంకరమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది. మియా ఆ నరకం నుంచి తప్పించుకుంటుందా ? మిగతా అమ్మాయిలను కూడా కాపాడుతుందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? మియా తన భర్త గురించి ఎలాంటి సీక్రెట్ తెలుసుకుంటుంది ?
అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్-థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×